logo

గ్రేవ్‌ కేసుల్లో పురోగతి సాధించాలి

గ్రేవ్‌ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి పురోగతి సాధించాలని ఎస్పీ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లాలో నమోదైన గ్రేవ్‌, ఎస్టీ, ఎస్టీ, పోక్సో, అత్యాచారం, హత్య కేసులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు

Updated : 18 Apr 2024 06:36 IST

 (మాట్లాడుతున్న ఎస్పీ రాధిక)

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: గ్రేవ్‌ కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేపట్టి పురోగతి సాధించాలని ఎస్పీ రాధిక పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం జిల్లాలో నమోదైన గ్రేవ్‌, ఎస్టీ, ఎస్టీ, పోక్సో, అత్యాచారం, హత్య కేసులపై సమీక్ష నిర్వహించి మాట్లాడారు. కేసుల నమోదు, నిందితుల అరెస్ట్‌, దర్యాప్తు, ఛార్జిషీట్‌ దాఖలు వరకు సమగ్రమైన విచారణ చేయాలని సూచించారు. దర్యాప్తు వేగవంతం చేసి కోర్టులో అభియోగపత్రాలు వీలైనంత వేగంగా దాఖలు చేయాలన్నారు. పాత నేరస్థులపై నిఘా ఏర్పాటు చేసి, వారి ఉనికిని తెలుసుకోవాలని చెప్పారు. ఈనెల 18వ తేది నుంచి ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ నిర్వహణకు స్థానిక పోలీసు అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాల్లో సీఐ, ఎస్‌ఐలు పర్యటించి ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు ఎస్పీ ప్రేమ్‌కాజల్‌, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని