logo

జిల్లా అభివృద్ధికి నాదీ భరోసా

రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం..

Published : 24 Apr 2024 05:30 IST

వంశధార పూర్తి చేస్తాం,  పాతపట్నంలో ఐటీడీఏ ఏర్పాటు
ఉపాధి అవకాశాలు పెంచుతాం, విద్యా సంస్థలు నెలకొల్పుతాం
పాతపట్నం, ఆమదాలవలస ప్రజాగళం సభల్లో తెదేపా అధినేత చంద్రబాబు

ఆమదాలవలసలో మాట్లాడుతున్న చంద్రబాబు, చిత్రంలో పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులు రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

రాష్ట్రంలోనే కాదు దేశంలోని ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారు.. నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయి.. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం ఎక్కడికో వెళ్లకుండా స్థానికంగానే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటాం.. తెదేపా హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగింది.. రానున్న ఐదేళ్లు ఊహించని విధంగా పని చేస్తాం..  అభివృద్ధికి నాదీ భరోసా’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. పాతపట్నం, ఆమదాలవలసలో మంగళవారం నిర్వహించిన ప్రజాగళం సభల్లో ఆయన మాట్లాడారు. వైకాపా పాలనలో జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.. వంశధార ప్రాజెక్టు పూర్తి చేస్తామని, నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.. రెండుచోట్ల జరిగిన సభలకు జనం పోటెత్తారు.. సభా ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న వైకాపా సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, జిల్లాలో పాలకుల అరాచకాలను ఎండగడుతూ చంద్రబాబు మాట్లాడారు.

ఆమదాలవలస ప్రజాగళం సభకు భారీగా హాజరైన జనం

 ఈనాడు డిజిటల్‌ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, టెక్కలి, పాతపట్నం, ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం, బూర్జ ఆమదాలవలస పట్టణం, గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు