logo

కొడైక్కానల్‌లో వేసవి పుష్ప ప్రదర్శన

కొడైక్కానల్‌లో ఏటా వేసవి ఉత్సవాల పేరిట పుష్ప ప్రదర్శన నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వ్యాప్తి కారణంగా జరుపలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం పుష్ప ప్రదర్శనను మంత్రులు ఇ.పెరియస్వామి, ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, మదివేందన్‌, చక్రపాణి హాజరై ప్రారంభించారు

Published : 25 May 2022 01:29 IST

ప్రారంభించిన మంత్రులు

ప్రదర్శనను ప్రారంభిస్తున్న మంత్రులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: కొడైక్కానల్‌లో ఏటా వేసవి ఉత్సవాల పేరిట పుష్ప ప్రదర్శన నిర్వహిస్తుంటారు. గత రెండేళ్లు కరోనా వ్యాప్తి కారణంగా జరుపలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడు ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం పుష్ప ప్రదర్శనను మంత్రులు ఇ.పెరియస్వామి, ఎమ్మార్కే పన్నీర్‌సెల్వం, మదివేందన్‌, చక్రపాణి హాజరై ప్రారంభించారు. ప్రదర్శనలో భాగంగా బ్రైంట్‌ పార్కులో పర్యాటకులను ఆకర్షించేలా పుష్పాలతో రూపొందించిన నెమలి, డైనోసర్‌, భౌగోళిక గుర్తింపు పొందిన తెల్ల వెల్లుల్లి వంటి వాటిని కొలువు దీర్చారు. వేసవి ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు కొడైక్కానల్‌కి చేరుకుంటున్నారు. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యాటకులను ఆహ్లాదపరిచేలా పలు పోటీలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు క్రీడాభివృద్ధి అథారిటీ (ఎస్‌డీఏటీ) తరఫున బ్రైంట్‌ పార్కులో మ్యూజికల్‌ చైర్‌ పోటీలు నిర్వహించారు. బుధవారం ఉదయం తాడు లాగుడు పోటీలు నిర్వహిస్తారు. 26న స్లో సైక్లింగ్‌, శాకింగ్‌ రేస్‌ 27న ముంజిక్కల్‌ క్రీడా మైదానంలో పురుషులు, మహిళలకు వాలీబాల్‌ పోటీలు, 28న హాకీ పోటీలు, 29న కబడ్డీ, 30, 31న ఫుట్‌బాల్‌ పోటీలు నిర్వహిస్తారు. జూన్‌ 1న బ్రైంట్‌ పార్కులో పురుషులు, మహిళలకు మినీ మారథాన్‌ పోటీలు నిర్వహిస్తారు. ప్రతి పోటీలో విజేతలైన వారికి బహుమతులు పంపిణీ చేస్తారు. వీటితో పాటు పడవ అలంకార పోటీలు, బాతులు పట్టే పోటీలు, శునక ప్రదర్శనతో పాటు పలు పోటీలు నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని