logo

మంత్రులకు నోటి దురుసు ఎక్కువ

మహిళలు ఓసీ ప్రయాణం చేస్తున్నారని మంత్రి ఒకరు వ్యాఖ్యానించారని, రాష్ట్ర అమాత్యులకు నోటి దురుసు ఎక్కువని అన్నాడీఎంకే సీనియర్‌ నేత సెల్లూర్‌ రాజు ఆరోపించారు.

Published : 03 Oct 2022 00:36 IST

అన్నాడీఎంకే నేత సెల్లూర్‌ రాజు ఆరోపణ

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: మహిళలు ఓసీ ప్రయాణం చేస్తున్నారని మంత్రి ఒకరు వ్యాఖ్యానించారని, రాష్ట్ర అమాత్యులకు నోటి దురుసు ఎక్కువని అన్నాడీఎంకే సీనియర్‌ నేత సెల్లూర్‌ రాజు ఆరోపించారు. మదురైలో స్వచ్ఛంద సంస్థ తరఫున ఉచిత వైద్య శిబిరం ఆదివారం జరిగింది. దీనిని ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ..... పండుగ సమయంలో ఆమ్ని బస్సు ఛార్జీలు పెంచారన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలన్నారు. దీపావళి రానున్న సమయంలో పలురెట్లు పెంచడం న్యాయం కాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించాలని చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక బస్సులు ఎక్కువగా నడపాలని తెలిపారు. మంత్రులందరూ ప్రజల సొమ్ముతో దర్జాగా జీవిస్తున్నారని తెలిపారు. మహిళలను చూసి ఓసీ ప్రయాణం అని ఓ మంత్రి అన్నారన్నారు. మంత్రులకు నోటి దురుసు ఎక్కువని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం అనే బదులు మహిళలకు ఛార్జీల్లేని బస్సులుగా వాటి పేర్లు మార్చాలని తెలిపారు. ప్రస్తుతం రేషన్‌బియ్యం అక్రమరవాణా పలురెట్లు పెరిగిందన్నారు. చర్యలు తీసుకోవాల్సిన ఐఎఏస్‌ అధికారుల చేతులు కట్టేశారన్నారు. మదురై మేయర్‌ స్వేచ్ఛగా పనిచేయడం లేదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని