Surya: నిర్మాత వైద్యానికి నటుడు సూర్య సహాయం
‘పితామగన్’, ‘గజేంద్ర’, ‘లవ్‌లీ’, ‘లూటీ’ వంటి పలు చిత్రాలకు నిర్మాత వీఏ దురై. బాలా దర్శకత్వంలోని ‘పితామగన్’ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది.
కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘పితామగన్’, ‘గజేంద్ర’, ‘లవ్‌లీ’, ‘లూటీ’ వంటి పలు చిత్రాలకు నిర్మాత వీఏ దురై. బాలా దర్శకత్వంలోని ‘పితామగన్’ ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇందులో సూర్య, విక్రం నటించిన విషయం తెలిసిందే. జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. అయితే ఈ నిర్మాత అనారోగ్యంతో బాధపడుతూ, వైద్యానికి డబ్బుల్లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ఆయన ఆదివారం ఓ వీడియోను కూడా విడుదల చేశారు. మధుమేహం కారణంగా కాలికి శస్త్రచికిత్స చేయాలని, వైద్య ఖర్చులకు కూడా డబ్బుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో చూసిన సూర్య వెంటనే స్పందించారు. వైద్య ఖర్చులకు రూ.2 లక్షలు అందించారు. ఇంకా పలువురు నటులు కూడా తమవంతుగా నగదు ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
The Vaccine War: ‘ది వ్యాక్సిన్ వార్’.. ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ.. రెండు రోజులే!
-
ఊరేగింపులో పడిపోయిన వినాయకుడి విగ్రహం.. సాయం చేసిన ముస్లిం యువత.. వీడియో!
-
JK: ₹300 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. ఇద్దరి అరెస్టు
-
Narnia: గుజరాత్ సముద్ర తీరానా హుందాగా మృగరాజు.. అరుదైన ఫొటో వైరల్..!
-
Chahal: బాధ ఎందుకు ఉండదు.. కానీ 15 మందికే కదా అవకాశం: చాహల్
-
PM Modi: తెలంగాణకు పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ: ప్రధాని మోదీ