logo

బాధితులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు: ఉదయనిధి

ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమిళులను రక్షించి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తామని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు.

Published : 04 Jun 2023 01:27 IST

సైదాపేట, న్యూస్‌టుడే: ఒడిశా రైలు ప్రమాదంలో చిక్కుకున్న తమిళులను రక్షించి రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు వేగవంతం చేస్తామని రాష్ట్ర యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ తెలిపారు. ప్రమాదానికి గురైన కోరమాండల్‌ రైలులో చెన్నై సెంట్రల్‌కు వచ్చేందుకు 101 మంది రిజర్వేషన్‌ చేయించుకోగా అందులో 17 మంది ప్రమాణించలేదని తెలుస్తోంది. ఘటనాస్థలికి మంత్రులు ఉదయనిధి స్టాలిన్‌, శివశంకర్‌, రవాణాశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఫణీంద్రరెడ్డి, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కుమార్‌ జయంత్‌, ఉపాధ్యాయ ఎంపిక సంఘం అధ్యక్షురాలు అర్చనా భట్నాయక్‌ తదితరులు చేరుకున్నారు. ఒడిశా వెళ్లేముందు చెన్నై విమానాశ్రయంలో మంత్రి ఉదయనిధి విలేకర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొననున్నట్లు తెలిపారు. గాయపడిన తమిళులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందినవారి వివరాలు ఇంకా పూర్తిగా తెలియలేదన్నారు. వారిని రక్షించి చికిత్స అందించేందుకు తగిన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని