logo

కుటుంబ రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టండి

దేశంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారు. తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా అశ్వథామన్‌ పోటీ చేస్తున్నారు.

Published : 17 Apr 2024 01:53 IST

మాట్లాడుతున్న రాజ్‌నాథ్‌సింగ్‌

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: దేశంలో కుటుంబ రాజకీయాలకు ప్రజలు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ కోరారు. తిరువణ్ణామలై లోక్‌సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా అశ్వథామన్‌ పోటీ చేస్తున్నారు. మంగళవారం ఆయనకు మద్దతుగా రాజ్‌నాథ్‌సింగ్‌ ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పాలనలో దేశానికి, ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. మోదీ పాలనలో ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టారని, దేశాన్ని కాపాడింది మోదీ అని చెప్పారు. తమిళనాడులో కుటుంబ రాజకీయ పాలన సాగుతోందన్నారు. మంత్రికి పార్టీ ప్రముఖులు ఘనస్వాగతం పలికారు.

సైదాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రానికి డీఎంకే కుటుంబ పాలన, అవినీతి తప్ప వేరే ఏమిచ్చిందో చెప్పాలని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిలదీశారు. కృష్ణగిరి భాజపా అభ్యర్థి సి.నరసింహన్‌కు మద్దతుగా మంగళవారం కృష్ణగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అవినీతిరహిత, అభివృద్ధి ఆధారిత పాలన అందించే సామర్థ్యం డీఎంకేకు లేదన్నారు. తెలిపారు. కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవటమే డీఎంకే, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌ ఏకైక లక్ష్యమని ధ్వజమెత్తారు. భాజపాకు దేశమే మొదట అని, డీఎంకేకు కుటుంబమే ముఖ్యమని చెప్పారు. జయలలిత కూడా పేదల కోసం పని చేశారని, ఆమెపై తనకు ఎప్పుడూ గౌరవం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని