logo

అక్రమాల అంతస్తులు!!

కొన్నిసార్లు కొందరు పట్టణ ప్రణాళికాధికారులు నిర్మాణదారులతో కుమ్మక్కవుతూ... వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నగరం మధ్యన ఉన్న అత్యంత విలువైన స్థలాల నుంచి భారీగా వీఎల్‌టీ రావాల్సి ఉన్నా పట్టించుకోకపోవటానికి తెర వెనుక సంగతులేననే ఆరోపణలున్నాయి.

Updated : 19 May 2022 05:36 IST

‘వీఎల్‌టీ’ చెల్లించకున్నా నిర్మాణాలకు అనుమతులు

మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ)కు ఆస్తి పన్నుతోపాటు వీఎల్‌టీ (ఖాళీ స్థలాల పన్ను) కూడా ఓ ఆదాయ వనరు. దీనిని అడ్డం పెట్టుకొని పలువురు అక్రమాలకు పాల్పడుతున్నారు. తమ జేబులు నింపేసుకుంటున్నారు. జీవీఎంసీ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారు. 300 గజాలు దాటిన ఖాళీ స్థలాల్లో ఏ నిర్మాణం చేపట్టాలన్నా... మూడేళ్ల కాలానికి ఆయా ప్రాంతాల ధరలను బట్టి వీఎల్‌టీ విధించిన తరువాతే ప్లాను మంజూరు చేయాలి.

కొన్నిసార్లు కొందరు పట్టణ ప్రణాళికాధికారులు నిర్మాణదారులతో కుమ్మక్కవుతూ... వారి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. నగరం మధ్యన ఉన్న అత్యంత విలువైన స్థలాల నుంచి భారీగా వీఎల్‌టీ రావాల్సి ఉన్నా పట్టించుకోకపోవటానికి తెర వెనుక సంగతులేననే ఆరోపణలున్నాయి.

విచారణ చేస్తే..

ఎండాడ, రుషికొండ, పీˆఎంపాలెం, బక్కన్నపాలెం, అగనంపూడి, కూర్మన్నపాలెం, పెందుర్తి ప్రాంతాలలో కొన్ని భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వాటి నుంచి వీఎల్‌టీలు వసూలు చేశారా లేదా అనే అంశాలపై విచారణ చేస్తే చాలా వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. జీవీఎంసీˆకి గత కొన్నేళ్లుగా వీఎల్‌టీల డిమాండ్‌ రూ.35 కోట్ల వద్దే ఉండటం కూడా అనుమానాలు బలపడుతున్నాయంటున్నారు.

* కొన్ని చోట్ల స్థల యజమాని భవన నిర్మాణ సన్నాహాలు చేసేముందే ఆ స్థలంలో చిన్నషెడ్డు నిర్మించి... దానికి పన్ను చెల్లించి వీఎల్‌టీ నుంచి మినహాయింపు పొందచ్చనేలా కొందరు అధికారులే అడ్డదారులు చూపుతున్నట్లు సమాచారం. ప్లాను ఆమోదానికి  దరఖాస్తు చేసినప్పుడు రెవెన్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వాల్సి ఉన్నా..అన్ని దస్త్రాల విషయంలో అలా చేయడం లేదు.

జీవీఎంసీˆ పరిధిలో ఇలా..
ఆస్తి పన్ను అసెస్‌మెంట్లు: 5,32,742(సుమారు)
వీఎల్‌టీ అసెస్‌మెంట్లు: 35,000
వీఎల్‌టీ ఆదాయం: రూ.35కోట్లు

-న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని