logo

205 కేజీల గంజాయి స్వాధీనం

సెబ్‌ అధికారులు, పెందుర్తి పోలీసులు రెండు ప్రాంతాల్లో దాడులు జరిపి 205 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేపగుంట అన్న క్యాంటీన్‌ వద్ద సోమవారం టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా రెండు కార్లలో నలుగురు వ్యక్తులు సుమారు 158 కేజీల గం

Published : 28 Jun 2022 06:32 IST


స్వాధీనం చేసుకున్న గంజాయి పొట్లాలు, కారుతో సెబ్‌ అధికారులు

వేపగుంట, న్యూస్‌టుడే: సెబ్‌ అధికారులు, పెందుర్తి పోలీసులు రెండు ప్రాంతాల్లో దాడులు జరిపి 205 కేజీల గంజాయిని పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వేపగుంట అన్న క్యాంటీన్‌ వద్ద సోమవారం టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా రెండు కార్లలో నలుగురు వ్యక్తులు సుమారు 158 కేజీల గంజాయిని ప్యాకెట్ల రూపంలో తరలిస్తున్నట్టు గుర్తించారు. పాడేరు నుంచి నగరానికి గంజాయి తీసుకొస్తున్నట్లు నిందితులు తెలిపారు. ఇద్దరు నిందితులు పాడేరు ప్రాంతం వంజంగి గ్రామానికి చెందిన మస్తిగిరి, గొట్టుపట్టి గ్రామానికి చెందిన పుత్తూరు లింగమూర్తి దొరికారు. తప్పించుకున్న మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పెందుర్తి సీఐ ఆశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ గణేశ్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు పెందుర్తి కూడలిలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు సోమవారం వాహనాల తనిఖీలు జరిపారు. కారులో తరలిస్తున్న 45 కేజీల ఎండు గంజాయి, 2లీటర్ల లిక్విడ్‌ గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కేరళకు చెందిన అబ్దుల్లా, మహమ్మద్‌ సాహిద్‌, విక్కి నిజామ్‌ ముఠాగా ఏర్పడ్డారు. అబ్దుల్లా, సాహిద్‌ కేరళ నుంచి కారులో బయలుదేరి ఈనెల 24న పెదబయలులోని కృష్ణారావు ఇంటికి వెళ్లారు. రెండు రోజులు అతనింట్లో ఉన్నారు. అక్కడ కొంత మంది నుంచి కృష్ణారావు గంజాయి సేకరించాడు. తిరుగు ప్రయాణంలో వారిని విశాఖకు చేర్చే క్రమంలో పెందుర్తి కూడలిలో సెబ్‌ అధికారులకు పట్టుబడ్డారు. నిందితులు ఈ గంజాయిని విక్కి నిజామ్‌కు రూ.2లక్షలకు విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీరు మూడు నెలల క్రితం ఇలాగే గంజాయిని తరించినట్లు పోలీసు విచారణలో తేలింది. దాడుల్లో సెబ్‌ సీఐ సరోజాదేవి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని