logo

కష్టం ఫలించె.. ర్యాంకు వరించె..!

ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ విద్యార్థులు. ఇంటర్‌ ప్రారంభం నుంచి చదువే లోకంగా సాగారు.. ప్రతి సబ్జెక్టును సమగ్రంగా అభ్యసించి పట్టుపెంచుకున్నారు. నిత్యం నమూనా పరీక్షలు రాస్తూ తమ స్థాయిని అంచనా వేసుకున్నారు.

Published : 09 Aug 2022 06:51 IST

జేఈఈ మెయిన్స్‌లో విద్యార్థుల మెరుపులు

న్యూస్‌టుడే, గురుద్వారా, అక్కిరెడ్డిపాలెం, కూర్మన్నపాలెం, మద్దిలపాలెం, వేపగుంట, అక్కయ్యపాలెం

కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ విద్యార్థులు. ఇంటర్‌ ప్రారంభం నుంచి చదువే లోకంగా సాగారు.. ప్రతి సబ్జెక్టును సమగ్రంగా అభ్యసించి పట్టుపెంచుకున్నారు. నిత్యం నమూనా పరీక్షలు రాస్తూ తమ స్థాయిని అంచనా వేసుకున్నారు. ఎక్కడ వెనుకబడి ఉన్నారో తెలుసుకుంటూ..వైఫల్యాలను అధిగమిస్తూ ముందుకు సాగారు.. తదేక దీక్షతో జేఈఈ మెయిన్స్‌కు సిద్ధమై పరీక్షలు రాశారు. కష్టం ఫలించి ఉత్తమ ర్యాంకులు సాధించారు.. అడ్వాన్స్‌డ్‌లో కూడా ఉత్తమ ర్యాంకులు సాధించేలా కఠోరంగా శ్రమిస్తున్నారు. సోమవారం విడుదలైన జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపిన వారిలో కొందరి వివరాలు ఇలా.


అన్ని సబ్జెక్టుల సమగ్ర అధ్యయనం

* గనిప చైతన్య సాయితేజ నీ ఆలిండియా 48, ఓబీసీ 8 (పర్సంటైల్‌ 99.998)

* తల్లిదండ్రులు జి.కృష్ణారావు, శ్రీలక్ష్మి. తండ్రి ఆర్మీలో ఉద్యోగి. నివాసం శ్రీకాకుళం జిల్లా పలాస.‘అన్ని సబ్జెక్టులు సమగ్రంగా చదివా’ అని చైతన్య పేర్కొన్నారు.

* ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయడం.


మెటీరియల్‌ తోడ్పాటుతో..

* వెచ్చ జ్ఞానమహేష్‌

* ఆలిండియా 93, ఈడబ్ల్యూఎస్‌ 11

* వీరిది అల్లిపురం. తల్లిదండ్రులు రామారావు, ఝాన్సీ. తండ్రి కొవ్వొత్తుల వ్యాపారం చేస్తుంటారు.

* ముంబయి ఐఐటీలో సీటు సాధించడం.‘మెటీరియల్‌ తోడ్పాటుతో ఈ ర్యాంకు వచ్చింది’.


పరిశోధనల వైపు వెళ్తా..

* కొణతాల రష్మిత

* ఆలిండియా 186, ఓబీసీ 21 (పర్సంటైల్‌ 99.986)

* తల్లిదండ్రులు శ్రీనివాసరావు, అనురాధ. తండ్రి ఖజానాశాఖలో సీనియర్‌ అసిస్టెంట. నివాసం కొమ్మాది.

* ముంబయి ఐఐటీలో సీటు సాధించి, ఇంజినీరింగ్‌ పూర్తయిన తరువాత పరిశోధన వైపు వెళ్తా..


8వ తరగతి నుంచే దృష్టి

* రెడ్డి లీలా జోగేందర్‌ సాయి నీ ఆలిండియా 312, ఓబీసీ 42

* తల్లిదండ్రులు ఆర్‌.పైడపు నాయుడు, భారతి. తండ్రి ఉపాధ్యాయుడు. నివాసం బొబ్బిలి సమీపంలోని గుచ్చిమి గ్రామం.

* ముంబయి ఐఐటీలో సీటు సాధించడం. ‘8వ తరగతి నుంచే దృష్టిసారించాను’.


నిత్యం 10గంటలపాటు చదివా..

* గెడ్డ సాయి శశాంక్‌

* ఆలిండియా 281, ఓబీసీ 33

* తల్లిదండ్రులు జి.వేణు, శిరీష. తండ్రి ఉపాధ్యాయుడు. నివాసం విజయనగరం.

* ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయడం. ‘నిత్యం పది గంటలు సాధన చేశాను’.


ఎప్పటి పాఠాలు అప్పుడే పూర్తి

* వాలేటి యశ్వంత్‌సాయి

* ఆలిండియా 603, ఓబీసీ 76

* తల్లిదండ్రులు అప్పలనాయుడు, పావని. తండ్రి ఉపాధ్యాయుడు. స్వగ్రామం పార్వతీపురం సమీపంలోని కుంకిడివరం.

* ముంబయి ఐఐటీలో సీఎస్‌ చేసి యాప్‌ డెవలపర్‌ అవుతా.‘ఎప్పటి పాఠాలు అప్పుడే పూర్తి చేయడం కలిచొచ్చింది’


పాఠాలను ఏకాగ్రతతో వినేవాడ్ని

* అమరాపు అనూప్‌

* ఆలిండియాలో 525, ఓబీసీ 67

* తండ్రి వెంకట సత్యనారాయణ రైల్వేల్లో విధులు నిర్వహిస్తున్నారు. తల్లి స్వర్ణకుమారి గృహిణి. నివాసం షీలానగర్‌ ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ ప్రాంతం.‘ కళాశాలలో అధ్యాపకులు చెప్పిన పాఠాలను ఏకాగ్రతతో వినేవాడ్ని. అంతే కాకుండా నిత్యం ఇంటి వద్ద ఆరేడు గంటలు చదివే వాడ్ని. ఏ రోజు సిలబస్‌ ఆరోజే పూర్తి చేసుకునేవాడిని’ రి ఐఐటీ ముంబయిలో కంప్యూటర్‌ సైన్స్‌ చదవడం.


నమూనా పరీక్షలు ఎక్కువగా రాశా..

* మామిడి భవ్యశ్రీ

* ఆలిండియా 673, ఓబీసీ 87

* తల్లిదండ్రులు కేశవరావు, శారద. తండ్రి ఉపాధ్యాయుడు.

* ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయడం. ‘నేను నమూనా పరీక్షలు ఎక్కువగా సాధన చేశా’.


ఐఐటీలో చదవాలని..

* పొట్ల సాయిఆదర్శ్‌

* ఆల్‌ ఇండియా 292.

* వీరిది శాతవాహననగర్‌, రోడ్డు నెం.8, కూర్మన్నపాలెం. తండ్రి పి.వెంకట రామారావు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి రాధిక గృహిణి. ‘‘కళాశాలలో చేరినప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు బోధించిన అంశాలను ఇంటివద్ద పునః పరిశీలన చేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాను. ప్రతీ రోజు ఇంటివద్ద 4 గంటలు చదివాను ’’

* మంచి కళాశాలలో ఐఐటీ చేసి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలన్నది నా కల.


ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ

* సీహెచ్‌ అభిజిత్‌

* ర్యాంకు 404

* తల్లిదండ్రులు వెంకట బదిరి నారాయణ, నాగ వెంకట నరసమ్మ. తండ్రి కస్టమ్స్‌లో అధికారి. ద్వారకానగర్‌లో నివాసం ఉంటున్నారు. ‘అధ్యాపకులు చెప్పిన పాఠాన్ని మననం చేయడం, ప్రతి అంశంపైనా ప్రత్యేక శ్రద్ధపెట్టడం ద్వారా ర్యాంకు సాధ్యమైంది’.

* ఐఐటీ ముంబయిలో సీటు సాధించడం.


రోబోటిక్స్‌ అంటే ఆసక్తి

* ఆమిటి ప్రియాంక నీ ఆలిండియా 744, ఈడబ్ల్యూఎస్‌ 79

* తల్లిదండ్రులు ప్రసాద్‌, భారతి. తండ్రి నీటి పారుదలశాఖలో ఇంజినీరు. నివాసం సంబర ప్రాంతం.

* రోబోటిక్స్‌ రంగం అంటే ఆసక్తి.. ముంబయి ఐఐటీలో పూర్తి చేస్తా. మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం చదివాను.


16 గంటల సాధన

* మహదాసు మాధవరాజ్‌

* ఆలిండియాల్‌ 495  

* తండ్రి దేవీప్రసాద్‌ ఉపాధ్యాయులు. తల్లి మాధవి గృహిణి. సుజాతనగర్‌ దరి పాపయ్యరాజుపాలెం ‘‘రోజు 16 గంటల పాటు సాధనచేశాను’.

* ఏదైనా ఐఐటీలో బీటెక్‌ చేసి ఎంఎస్సీ చేయడం


కంప్యూటర్‌ సైన్స్‌లో రాణించాలని...

* డి.జాన్‌ జోసఫ్‌

* ఆల్‌ఇండియా ర్యాంకు 82, కేటగిరి 1వ ర్యాంకు

* వీరిది సీతమ్మధార ప్రాంతం. తండ్రి డి.విల్సన్‌ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగి, తల్లి: జోషిరత్నం గృహిణి ‘రోజూ ప్రణాళిక ప్రకారం 13 నుంచి 14 గంటల వరకు సాధన చేశాను. సబ్జెక్టును అర్ధం చేసుకొని పదే పదే సాధన చేసేవాడిని. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో మంచి ర్యాంకు సాధించగలిగాను’’.

* ముంబయి ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలని కోరిక’


నిత్యం మెరుగుపర్చుకున్నా..

* మజ్జి హర్షవర్థన్‌

* ఆలిండియా 807, ఓబీసీ 106 (పర్సంటైల్‌ 99.924)

* తల్లిదండ్రులు గౌరీశ్వరరావు, శారద. తండ్రి ఉపాధ్యాయుడు. ‘‘నిత్యం కళాశాలలో పరీక్షలు పెట్టేవారు. తద్వారా ఎప్పటికప్పుడు నా స్థాయి ఏమిటో తెలిసేది. నిత్యం నన్ను నేను మెరుగు పరుచుకుంటూ రావడంతో ర్యాంకు వచ్చింది’.

* ఐఐటీలో కంప్యూటర్‌ చేసి, ఐటీ ఎనలిస్ట్‌ అవుతా.


అదనంగా మరో 4 గంటలు

* జొన్నాడ యశోధర్‌

* 10 (రిజర్వు కేటగిరి), ఓపెన్‌లో 586

* వీరిది కంచరపాలెం. తండ్రి ప్రైవేటు కళాశాలలో ఉద్యోగి ‘‘ప్రతిరోజు కాలేజీలోనే కాకుండా అదనంగా నాలుగు గంటలు చదివేవాడిని.’’

* భవిష్యత్తులో ఐఐటీలో కంప్యూటర్‌ సైన్స్‌ చేయాలని ఉంది.


అధ్యాపకుల శిక్షణలో...

* మయాంక్‌ అగర్వాల్‌

* ర్యాంక్‌ : 719

* వీరిది కిర్లంపూడి లేఅవుట్‌. తండ్రి అజేయ్‌కుమార్‌ కాంట్రాక్టర్‌. అమ్మ దీపాలి గృహిణి. ‘ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కళాశాలలో అధ్యాపకుల శిక్షణలో తర్ఫీదు పొందేవాడ్ని. ఇంటి దగ్గర ప్రతిరోజూ నాలుగు నుంచి ఐదు గంటల పాటు చదివేవాడ్ని’.

* ముంబయి ఐ.ఐ.టి.లో చేరి ఇ.ఇ.ఇ. చేయాలని కోరిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని