logo

మహిళా క్రికెటర్‌కు నేవీ ప్రశంసలు

అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టులో సభ్యురాలిగా ఉన్న విశాఖపట్నానికి చెందిన ఎండీ షబ్నమ్‌(15)ను బుధవారం తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) అధికారులు, నేవీ సివిలియన్‌ ఉద్యోగులు ప్రశంసించారు.

Published : 02 Feb 2023 05:22 IST

ఎండీ.షబ్నమ్‌

సింధియా, న్యూస్‌టుడే : అండర్‌-19 ప్రపంచకప్‌ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్‌ జట్టులో సభ్యురాలిగా ఉన్న విశాఖపట్నానికి చెందిన ఎండీ షబ్నమ్‌(15)ను బుధవారం తూర్పు నావికాదళం(ఈఎన్‌సీ) అధికారులు, నేవీ సివిలియన్‌ ఉద్యోగులు ప్రశంసించారు. ఆమె తండ్రి షకీల్‌ ఈఎన్‌సీకి చెందిన ఐఎన్‌ఎస్‌ కళింగలో లీడింగ్‌ ఫైర్‌మెన్‌గా, తల్లి ఈశ్వరమ్మ నేవీకి చెందిన మెటీరియల్‌ ఆర్గనైజేషన్‌-విశాఖ (ఎంవోవీ)లో ఎల్డీసీగా విధులు నిర్వహిస్తున్నారు. షబ్నమ్‌ స్ఫూరితో ఆమె చెల్లి షెహనాజ్‌ ఆంధ్ర అండర్‌-15 మహిళా క్రికెట్‌ జట్టులో సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని