logo

సిరిజాంలో గిరినాగు అలజడి

అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం సిరిజాంలో గురువారం రాత్రి అత్యంత విషపూరితమైన భారీ గిరినాగు (కింగ్‌కోబ్రా) అలజడి సృష్టించింది.

Updated : 01 Apr 2023 06:44 IST

గిరినాగును పట్టుకున్న వెంకటేశ్‌

చీడికాడ, న్యూస్‌టుడే: అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం సిరిజాంలో గురువారం రాత్రి అత్యంత విషపూరితమైన భారీ గిరినాగు (కింగ్‌కోబ్రా) అలజడి సృష్టించింది. ఈ గ్రామంలోని గండినాయుడు ఇంటి వద్ద ఈ పామును చూసిన జనం భయంతో వణికిపోయి పరుగులు తీశారు. దీనిపై అటవీగార్డు శివకుమార్‌కు సమాచారం అందించారు. స్పందించిన ఆయన మాడుగుల వణ్యప్రాణి సంరక్షణ ప్రతినిధి వెంకటేశ్‌ను అప్రమత్తం చేశారు. వెంకటేశ్‌ ఇక్కడికి చేరుకుని గిరినాగును సజీవంగా పట్టుకుని ఓ సంచిలో బంధించారు. ఈ పామును కోనాం సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ.. గిరినాగు దాదాపుగా 12 అడుగులకుపైగా, బరువు ఎనిమిది కేజీలు ఉన్నట్లు తెలిపారు. వీటిని పర్యావరణ సమతుల్యత కోసం సంరక్షించుకోవాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని