logo

జాతీయ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో దేవికి స్వర్ణం

గొలుగొండ మండలం కొత్తమల్లంపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గుడివాడ దేవి 2వ జాతీయ స్థాయి మాస్టర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో బంగారు పతకం సాధించారు.

Published : 31 May 2023 03:43 IST

బంగారు పతకంతో దేవి

కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే: గొలుగొండ మండలం కొత్తమల్లంపేట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న గుడివాడ దేవి 2వ జాతీయ స్థాయి మాస్టర్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ పోటీలో బంగారు పతకం సాధించారు. ఈనెల 27, 28 తేదీల్లో హైదరాబాద్‌ నగరంలోని చిక్కడపల్లి పోస్టల్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగిన పోటీల్లో 87 కేజీల విభాగంలో ఆమె ప్రతిభ చూపారు. తెలంగాణ మాస్టర్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ నిర్వహించిన ఈ జాతీయ స్థాయి క్రీడలకు 15 రాష్ట్రాల నుంచి వెయిట్‌ లిఫ్టర్లు హాజరయ్యారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి పోటీపడిన గుడివాడ దేవి విజేతగా నిలిచారు. ఈమెకు అసోసియేషన్‌ సభ్యులు బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు. ఆమెను మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయుడు ప్రసాద్‌, సహచర ఉపాధ్యాయులు అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని