logo

నేత్రపర్వంగా శ్రీవారి తెప్పోత్సవం

పోర్టు ఏరియాలోని వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది

Published : 04 Jun 2023 05:44 IST

సముద్రంలో విహరిస్తున్న స్వామివారు

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: పోర్టు ఏరియాలోని వెంకటేశ్వరస్వామి ఆలయ బ్రహోత్సవాల్లో భాగంగా శనివారం స్వామి వారి తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతుడైన వెంకటేశ్వరస్వామిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలతో కొండపై నుంచి కిందకు తెచ్చారు. అక్కడి నుంచి భక్తుల గోవింద నామస్మరణ మధ్య సముద్ర తీరం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి విశాఖ పోర్టు సమకూర్చిన టగ్గుపై అధిష్టింజేశారు. టగ్గును మరో నాలుగు చిన్న బోట్లు అనుసరించాయి. దాదాపు గంటకుపైగా స్వామివారు సముద్రంలో విహరించారు. అనంతరం ఒడ్డుకు తీసుకొచ్చి ఆలయానికి ఊరేగింపుగా తెచ్చారు. దిగువ నుంచి మెట్లమార్గంలో కొండపైకి తీసుకువెళ్లి పూజలు చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ స్వామివారికి పూజలు నిర్వహించి పల్లకీని మోశారు. ఆలయ ఏఓ ఎస్‌.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని