logo

Cheating: పెళ్లి పేరుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు బురిడీ.. రూ.10 లక్షలు కాజేసిన యువతి

అనకాపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు వివాహమై చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాడు. తిరిగి పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన మహిళ న్యాయవాదిని అంటూ పరిచయం చేసుకుంది.

Updated : 13 Jun 2023 09:13 IST

అనకాపల్లి పట్టణం. న్యూస్‌టుడే: అనకాపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు వివాహమై చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నాడు. తిరిగి పెళ్లి సంబంధాల కోసం వెతుకుతున్న సమయంలో హైదరాబాద్‌కు చెందిన మహిళ న్యాయవాదిని అంటూ పరిచయం చేసుకుంది. తనను పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ ఉద్యోగం చేయాలని తండ్రితో మాట్లాడించింది. తనకు తెలంగాణా హైకోర్టులో ఉన్న పరిచయాలతో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించింది. దీనికి ఖర్చు అవుతుందని చెప్పడంతో 2022 అక్టోబరులో రూ. 5 లక్షలు,  నవంబరులో రూ. 5 లక్షలు బ్యాంకు అకౌంట్‌ ద్వారా ఆమెకు డబ్బులు పంపారు.

ఉద్యోగం దొరక్కపోగా డబ్బులు అడుగుతుంటే ప్రియుడితో కలసి చంపేస్తానని బెదిరిస్తోందని బాధితుడు అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఫిర్యాదు చేశారు.  జిల్లాలో పోలీస్‌స్టేషన్ల పరిధిలో 34 ఫిర్యాదులు అందాయి. వీరితో జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు ఎస్పీ పరిపాలన విజయభాస్కర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని