logo

బస్సుల్లేక బాధలు.. తికమకలో మరో కేంద్రానికి విద్యార్థిని

పదో తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు అవస్థలు తప్పడం లేదు.

Updated : 19 Mar 2024 07:43 IST

దేవరాపల్లిలో కేంద్రం నుంచి తెనుగుపూడికి విద్యార్థిని స్కూటీపై తీసుకెళ్తున్న కానిస్టేబుల్‌

మాకవరపాలెం, దేవరాపల్లి, న్యూస్‌టుడే: పదో తరగతి విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వచ్చేందుకు అవస్థలు తప్పడం లేదు.  బస్సు సౌకర్యం లేని దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కో ఆటోలో సుమారు 15 మందికి పైగా వస్తున్నారు.  బాలికలు సైతం ఆటోల్లో కిక్కిరిసి, వెనుక భాగంలో కూర్చుని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించారు. అధికారులు స్పందించి పరీక్ష సమయంలో అందుబాటులో ఉండేలా బస్సులు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

దేవరాపల్లి మండలం తెనుగుపూడి కేంద్రంలో పరీక్ష రాయాల్సిన ఓ విద్యార్థిని పొరబాటున దేవరాపల్లి కేంద్రానికి వచ్చింది. దీంతో అక్కడే ఉన్న ఎస్సై నాగేంద్ర వెంటనే స్పందించారు. మహిళా కానిస్టేబుల్‌ చంద్రకళతో ఆ విద్యార్థినిని స్కూటీపై తెనుగుపూడి కేంద్రానికి పంపారు.

ఆటోలో మాకవరపాలెం వెళ్తున్న విద్యార్థులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని