logo

బాలుడి ప్రతిభకు గుర్తింపు

ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీప్రకాష్‌ విద్యార్థి బి.రియాన్ష్‌కు స్థానం దక్కింది. యూకేజీ చదువుతున్న రియాన్ష్‌ ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన ఎంపికలో 9 సెకన్లలో దక్షిణ అమెరికా ఖండంలోని 13 దేశాల జెండాలను గుర్తించాడు.

Published : 05 May 2024 03:53 IST

ప్రశంసా పత్రంతో రియాన్ష్‌

పాయకరావుపేట, న్యూస్‌టుడే: ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో శ్రీప్రకాష్‌ విద్యార్థి బి.రియాన్ష్‌కు స్థానం దక్కింది. యూకేజీ చదువుతున్న రియాన్ష్‌ ఆన్‌లైన్‌ ద్వారా జరిగిన ఎంపికలో 9 సెకన్లలో దక్షిణ అమెరికా ఖండంలోని 13 దేశాల జెండాలను గుర్తించాడు. ఈ బాలుడు ప్రపంచ పటంలో దేశాలను గుర్తించడంతోపాటు రాజధానులు, దేశంలోని రాష్ట్రాలు గుర్తిస్తూ ప్రతిభ చూపుతున్నాడు. చిన్నవయస్సులోనే ఇంత ప్రతిభ చూపడం హర్షణీయమని విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్‌.విజయ్‌ప్రకాష్‌ తెలిపారు. విద్యార్థిని సంస్థ అధినేత సీహెచ్‌.వి.కె.నరసింహారావు తదితరులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని