logo

ఐటీనా.. అదెక్కడుంది..!

యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్‌ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్‌పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి.

Updated : 05 May 2024 04:51 IST

విశాఖలో సాంకేతిక రంగాన్ని అటకెక్కించిన జగన్‌
ఇంజినీరింగ్‌ చేసిన యువతను వాలంటీర్లుగా మార్చిన వైకాపా

యువతకు అత్యధిక ఉద్యోగాలు కల్పించే ఐటీ రంగం జగన్‌ పాలనలో కుదేలైంది. చంద్రబాబు హయాంలో విశాఖలోని ఐటీ హిల్స్‌పై నెలకొల్పిన సంస్థలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయో తెలియని పరిస్థితి. వైకాపా పాలనలో విశాఖలోని పలు ఐటీ సంస్థలు ఇక్కడి నుంచి పారిపోయే దుస్థితికి తీసుకొచ్చారు. ఐటీ టెక్నాలజీలో ఇంజినీరింగ్‌ చదువులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి లేక పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. చివరికి ఇక్కడ ఉద్యోగాలు లేక రూ.5 వేల గౌరవ వేతనానికి వాలంటీర్లుగా కూడా పని చేస్తున్న ఇంజినీరింగ్‌ చేసిన పట్టభద్రులున్నారంటే ఐటీ రంగం దుస్థితిని అంచనా వేయొచ్చు.

న్యూస్‌టుడే, పెందుర్తి, వేపగుంట, పరవాడ, సబ్బవరం

  • బీటెక్‌ పూర్తి చేసినా..: నేను బీటెక్‌ పూర్తి చేశాను. విశాఖలో ఎలాంటి ఉపాధి అవకాశాలు రాలేదు. ప్రాంగణ ఎంపికల్లో ఉద్యోగాలొచ్చినా ఎటూచాలని జీతాలతో పొరుగు రాష్ట్రాల్లో పని చేయడం చాలాకష్టం. చాలామంది యువత నైపుణ్యాలు లేక మంచి ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు. నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా యువతకు మెరుగులు దిద్దితే మంచి ఉపాధి పొందే అవకాశం ఉంటుంది.

ఎ.ఉమామహేశ్వరరావు, పులగవానిపాలెం

ఐటీ మంత్రిది విశాఖే అయినా..

ఐటీ శాఖ మంత్రి అమర్‌నాథ్‌ విశాఖకు చెందిన వ్యక్తే అయినప్పటికీ జిల్లాకు ఒక్క పరిశ్రమ తెప్పించలేకపోయారు. ఐటీ రంగాన్ని ప్రోత్సహించినట్లయితే యువతకు ఎక్కువగా ఉద్యోగాలు వచ్చేవి. విద్యార్థులు కుటుంబ సభ్యులను వదిలిపెట్టి మరో గత్యంతరం లేక బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై వంటి నగరాలకు వలస పోతున్నారు.

ఎస్‌.ఆర్‌.కృష్ణ, సబ్బవరం

ఐటీ హబ్‌ ఎక్కడుందో తెలీదు..:

జిల్లాలోనే ఐటీ మంత్రి ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్క ఐటీ కంపెనీని ప్రారంభించలేకపోయారు. నగరంలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ప్రచారంలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అది ఎక్కడ ఏర్పాటు చేశారన్నది ఆయనకే తెలియాలి. ఐటీ రంగం అభివృద్ధి  చేయకపోవడంతో విద్యార్థులంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

సంధ్య, సింహాద్రినగర్‌

  • యువతను మోసం చేసిన జగన్‌..: సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఐటీ రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఆయన హయాంలో ఎటువంటి పరిశ్రమలు రాలేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని గొప్పగా ప్రచారం చేసుకుని దాన్నీ గాలికొదిలేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంతో ఎంతోమంది దేశ, విదేశాల్లో ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

మేడశెట్టి బాలాజీనాయుడు, ఈ.భోనంగి

  • పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోంది..: ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఐటీ ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాల్సి వస్తోంది. ఈ ఐదేళ్లలో నాకు తెలిసిన వారిలో చాలామందికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించలేదు. ముఖ్యంగా మహిళలకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తే చాలా సౌలభ్యంగా ఉంటుంది. వారు కూడా ఇప్పుడు తప్పక ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సి వస్తోంది.  

ఉమామహేశ్వరి, ప్రహ్లాదపురం

  • మౌలిక సదుపాయాలు లేవు..: పరిశ్రమలు రావాలంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు కావాల్సిన భూమి, విద్యుత్తు, నీరు సదుపాయాలు కల్పిస్తే సంస్థలు ఏర్పాటు చేస్తారు. గతంలో స్కిల్‌ డవలప్‌మెంట్‌ కేంద్రాల్లో శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాలు వచ్చేలా చేశారు. ఇలాంటి వాటిమీద ప్రస్తుత ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం బాధాకరం.

ఎం.వర్థన్‌, సబ్బవరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు