logo

‘యువతకు నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తాం’

తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌

Published : 06 May 2024 03:14 IST

పెందుర్తిలో సీఎం రమేశ్‌, పంచకర్ల రమేశ్‌బాబును గజమాలతో సత్కరిస్తున్న నాయకులు

పెందుర్తి, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే వృద్ధులకు రూ.4 వేలు పింఛను అమలు చేయడంతో పాటు యువతకు ప్రతినెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని అనకాపల్లి భాజపా ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్‌, పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు పేర్కొన్నారు. జీవీఎంసీ తెదేపా ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం 96వ వార్డు పరిధిలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా పంచకర్ల మాట్లాడుతూ.. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోతో రాష్ట్రంలో ప్రజల జీవన విధానంలో మార్పు వస్తుందన్నారు. అన్నివర్గాల ప్రజలకు భరోసా కల్పించేలా మ్యానిఫెస్టో రూపొందించామన్నారు. సీఎం రమేశ్‌ మాట్లాడుతూ ఎన్‌డీఏ ఆధ్వర్యంలో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే భారత్‌ వెలిగిపోతుందన్నారు. పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి పంచకర్లను, కమలం గుర్తుపై ఓటు వేసి సీఎం రమేశ్‌ను గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. 96వ వార్డు తెదేపా అధ్యక్షుడు వేగి పరమేశ్వరరావు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గజమాలతో సత్కరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని