logo

‘వైకాపా పాలనలో సహజ వనరుల లూఠీ’

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జగదాంబకూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

Published : 06 May 2024 03:36 IST

మాట్లాడుతున్న బృందాకారాట్‌

జగదాంబకూడలి, న్యూస్‌టుడే: ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జగదాంబకూడలిలోని పార్టీ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండియా కూటమి తరపున కాంగ్రెస్‌ పార్టీ నుంచి విశాఖ లోక్‌సభకు పోటీ చేస్తున్న పి.సత్యారెడ్డి, పశ్చిమం సీపీఐ అభ్యర్థి విమల, గాజువాక సీపీఎం అభ్యర్థి జగ్గు నాయుడులను గెలిపించాలని కోరారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీల అమలులో భాజపా విఫలమైందని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్ర హక్కులను పోరాడి సాధించుకునే విషయంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. అంతేకాకుండా ఆ పార్టీ నాయకులు సహజ వనరులను లూఠీ చేశారని ధ్వజమెత్తారు. సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్‌ నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని