logo

వట్టిగెడ్డలో తగ్గుతున్న నీటిమట్టం

వట్టిగెడ్డ జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 399 అడుగులు కాగా ప్రస్తుతం 386 అడుగుల మేర ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ రఘు తెలిపారు. ఆయన సోమవారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఇటీవల 398 అడుగుల మేర

Published : 18 Jan 2022 05:35 IST


స్పిల్‌వే వద్ద కిందకు దిగిన నీరు

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: వట్టిగెడ్డ జలాశయం నీటిమట్టం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. జలాశయం గరిష్ఠ నీటిమట్టం 399 అడుగులు కాగా ప్రస్తుతం 386 అడుగుల మేర ఉన్నట్లు ప్రాజెక్టు ఏఈ రఘు తెలిపారు. ఆయన సోమవారం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఇటీవల 398 అడుగుల మేర నీరు చేరిందని, దీంతో ఖరీఫ్‌లో వరి పంటకు సాగునీరు అందించామన్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో పూర్తిగా లేకపోవడంతో ఉన్న నీరు కుడి, ఎడమ కాలువల లీకులు ద్వారా వృథాగా పోవడంతో నీటిమట్టం క్రమంగా తగ్గుతోందని, త్వరలో ఆధునికీకరణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని