logo

అదనపు పరిహారానికి డిమాండు

హరిత రహదారి నిర్మాణానికి భూములిచ్చిన తమకు పరిహారం పెంచాలని పాచిపెంట మండలంలోని మాతుమూరు, గురివినాయుడుపేట రెవెన్యూ పరిధిలోని పలువురు రైతులు కోరారు. రోడ్డు నిర్మాణానికి మాతుమూరు గ్రామం వద్ద కేటాయించిన భూములను

Published : 20 Jan 2022 05:10 IST

మాతుమూరులో ధాన్యం లోడును పరిశీలిస్తున్న

జేసీ కిశోర్‌కుమార్‌, సబ్‌ కలెక్టరు భావన

పాచిపెంట, న్యూస్‌టుడే: హరిత రహదారి నిర్మాణానికి భూములిచ్చిన తమకు పరిహారం పెంచాలని పాచిపెంట మండలంలోని మాతుమూరు, గురివినాయుడుపేట రెవెన్యూ పరిధిలోని పలువురు రైతులు కోరారు. రోడ్డు నిర్మాణానికి మాతుమూరు గ్రామం వద్ద కేటాయించిన భూములను జేసీ కిశోర్‌ కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ భావన బుధవారం పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. తొలివిడతగా 25 ఎకరాలిచ్చామని, మళ్లీ వలయ రహదారికి 83 ఎకరాలు కేటాయిస్తే జీవనాధారం కోల్పోతామని వాపోయారు. అదనపు పరిహారంతో పాటు ప్రభుత్వ స్థలం ఇవ్వాలని, కుటుంబానికి ఒక ఉద్యోగం, ఇళ్లు కోల్పోతున్న వారికి పునరావాసం కల్పించాలని కోరడంతో.. సమస్యలను కలెక్టరు దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వానికి నివేదిస్తామని జేసీ హామీ ఇచ్చారు. తహసీల్దారు రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని