logo

పాలకేంద్రమే పాఠశాల

ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు, పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలిని చూసి విద్యాలయం అనుకుంటే పొరపాటే. ఇది ఎల్‌.కోట మండలంలోని వేచలపువానిపాలెంలో ఉన్న ఓ పాలసేకరణ కేంద్రం. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. ఆ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. తల్లిదండ్రు

Published : 26 Jan 2022 06:22 IST

ఈ చిత్రంలో కనిపిస్తున్న విద్యార్థులు, పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయురాలిని చూసి విద్యాలయం అనుకుంటే పొరపాటే. ఇది ఎల్‌.కోట మండలంలోని వేచలపువానిపాలెంలో ఉన్న ఓ పాలసేకరణ కేంద్రం. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 27 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులున్నారు. ఆ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా చిన్నారులను ఇటీవల ఈ కేంద్రంలోకి తరలించారు. ఇక్కడి సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేశామని, కొత్త భవన నిర్మాణానికి ప్రతిపాదనలు చేశామని ప్రధానోపాధ్యాయురాలు వాసవి తెలిపారు.- న్యూస్‌టుడే, లక్కవరపుకోట

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని