logo

చెడువ్యసనాల నియంత్రణపై అవగాహన కార్యక్రమం

ప్రజలు మత్తుపానీయాలు, చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు ఎయిమ్స్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన....

Updated : 26 Jan 2022 15:30 IST

బలిజిపేట: ప్రజలు మత్తుపానీయాలు, చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండేందుకు ఎయిమ్స్‌ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు్న్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు సునిల్‌ కుమార్‌ అన్నారు. బలిజిపేటలోని ఓ పాఠశాల ఆవరణలో సంస్థ వ్యవస్థాపకుడు టీవీ సునిల్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చెడు వ్యసనాలబారిన పడకుండా ప్రజలు, సంస్థ సభ్యులు తెలియజేసిన అంశాలను పాటించాలని సంస్థ జిల్లా కన్వీనర్‌ బీమారావు, సురేశ్‌ తదితరులు కోరారు. కార్యక్రమంలో ఎమ్‌ఈవో శ్రీనివాసరావు, ఎయిమ్స్‌ సభ్యులు శాంతారామ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని