logo

చూసొద్దామా కనకమహాలక్ష్మి జాతర

ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి 24వ జాతర మహోత్సవాలు 6 నుంచి 8 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి మొదటి పూజ జరగనుంది. ఆ తర్వాత దర్శనాలు మొదలవుతాయి. ఇప్పటికే

Published : 05 Mar 2022 05:46 IST

నేటి అర్ధరాత్రి అమ్మవారికి పూజలు ప్రారంభం


ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం.. చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి 24వ జాతర మహోత్సవాలు 6 నుంచి 8 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం వేకువజామున రెండు గంటలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి మొదటి పూజ జరగనుంది. ఆ తర్వాత దర్శనాలు మొదలవుతాయి. ఇప్పటికే ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా కుటుంబ సభ్యులతో ఇళ్లకు చేరుకోవడంతో పట్టణ వీధుల్లో సందడి నెలకొంది. మూడు రోజులు సాయంత్రం 5 నుంచి అర్ధరాత్రి వరకు జాతర తిలకించడానికి భక్తజనం పోటెత్తుతారు. అమ్మవారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం రూ.100, రూ.30, రూ.20, రూ.10 టిక్కెట్లు పెట్టి క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా ఆలయ ప్రాంగణంలో టెంట్లు వేశారు. జాతరలో భాగంగా మూడు రోజులు సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారుజాము వరకు భారీగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండు వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, ఏడుగురు సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 400 మంది పోలీస్‌ సిబ్బంది, రెండు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాల సభ్యులు ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు బందోబస్తు నిర్వహించనున్నారు. జాతర ఏర్పాట్లను సంయుక్త కలెక్టర్‌ (ఆసరా) వెంకటరావు శుక్రవారం పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు