logo

‘గతంలో రద్దైంది.. మళ్లీ అభిప్రాయ సేకరణా?’

ఉత్తరావల్లి రెవెన్యూ పరిధిలో మెస్సర్స్‌ శ్రీనివాస మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ సంస్థ వారు క్వార్ట్జ్‌ ఉత్పత్తి చేసేందుకు డీఆర్‌వో గణపతిరావు సమక్షంలో శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. ఇందులో ఉత్తరావల్లి, గదబవలస గ్రామ స్థులు పాల్గొన్నారు.

Published : 21 May 2022 04:33 IST


ఉత్తరావల్లిలో మాట్లాడుతున్న డీఆర్‌వో గణపతిరావు

మెరకముడిదాం, న్యూస్‌టుడే: ఉత్తరావల్లి రెవెన్యూ పరిధిలో మెస్సర్స్‌ శ్రీనివాస మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ సంస్థ వారు క్వార్ట్జ్‌ ఉత్పత్తి చేసేందుకు డీఆర్‌వో గణపతిరావు సమక్షంలో శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. ఇందులో ఉత్తరావల్లి, గదబవలస గ్రామ స్థులు పాల్గొన్నారు. గతంలో ఎం.రావివలస సమీపంలో ఏర్పాటైన క్వార్ట్జ్‌ సంస్థ హామీలు నెరవేర్చలేదని, వీరూ అలాగే చేస్తారేమో అనే సందేహాన్ని రైతు సారయ్య వెల్లబుచ్చారు. గదబవలసకు చెందిన రాంబాబు మైన్‌ సమీపంలో తనకు మామిడి తోట ఉందని, పనులు ప్రారంభిస్తే పంటలు నాశనమవుతాయని వాపోయారు. గనుల అనుమతులను కోర్టు గతంలో రద్దు చేస్తే మళ్లీ అభిప్రాయ సేకరణ ఎలా నిర్వహిస్తారని వారు ప్రశ్నించారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండు చేశారు. యాజమాన్యం తరఫున శ్రీనివాస్‌ మాట్లాడుతూ తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని, కాలుష్య నియంత్రణకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తహసీల్దార్‌ రత్నకుమార్, ఆర్‌ఐ అజయ్‌కుమార్, వైస్‌ ఎంపీపీ హరిబాబు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని