logo

ఏడు రోజుల్లో నివేదిక ఇవ్వాలి

‘స్పందన’ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదిక ఏడు రోజుల్లో ఇవ్వాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ స్పష్టం చేశారు. సోమవారం పోలీసు కార్యాలయంలో జరిగిన ‘స్పందన’లో 27 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. తమ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి వి

Published : 24 May 2022 05:14 IST


సమస్య అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: ‘స్పందన’ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదిక ఏడు రోజుల్లో ఇవ్వాలని ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ స్పష్టం చేశారు. సోమవారం పోలీసు కార్యాలయంలో జరిగిన ‘స్పందన’లో 27 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. తమ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి విజయనగరానికి చెందిన కొందరు యత్నిస్తున్నారని పార్వతీపురానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడానికి కొందరు చూస్తున్నారని గజపతినగరం మండలం రంగుపురానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అదనపు ఎస్పీ పి.సత్యనారాయణరావు, డీసీఆర్‌బీ సీఐ బి.వెంకటరావు, ఎస్‌బీ సీఐ సీహెచ్‌ రుద్రశేఖర్, ఎస్‌ఐలు వాసుదేవ్, ముకుందరావు పాల్గొన్నారు. 

కలెక్టరేట్‌లో 120 వినతులు
కలెక్టరేట్, న్యూస్‌టుడే: పింఛన్లు, ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇప్పించాలని పలువురు వినతులు అందించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘స్పందన’లో అర్జీదారుల నుంచి కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, జేసీ మయూర్‌ అశోక్, డీఆర్వో ఎం.గణపతిరావు, ఉప కలెక్టర్లు పద్మావతి, సూర్యనారాయణ తదితరులు 120 వినతులు స్వీకరించారు. ‘స్పందన’ దరఖాస్తు ఏ ఒక్కటీ గడువు దాటకుండా చూడాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని