logo

ఆశ్రమ పాఠశాలల తనిఖీ

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఐటీడీఏ పీవో అంకిత్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఏటూరునాగారంలోని ఆకులవారిఘణపురం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను, పీఎంహెచ్‌ బాలుర, బాలికల వసతిగృహాలను

Published : 29 Jun 2022 03:17 IST

మధ్యాహ్న భోజనం పరిశీలిస్తున్న పీవో అంకిత్‌

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను ఐటీడీఏ పీవో అంకిత్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఏటూరునాగారంలోని ఆకులవారిఘణపురం బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను, పీఎంహెచ్‌ బాలుర, బాలికల వసతిగృహాలను తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో వసతులు ఎలా ఉన్నాయో పరిశీలించారు. పాఠశాలకు రావాల్సిన రెన్యువల్‌ విద్యార్థులను తిరిగి చేరే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. పీఎమ్మార్సీ భవనాన్ని తనిఖీ చేసి వినియోగించుకోవాలన్నారు. భవనం ఆవరణలోని న్యూట్రీ బాస్కెట్‌ తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఏపీవో వసంతరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకుడు పోచం, ఏటీడీవో దేశీరాం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని