logo

చిన్నారికి సదరం ధ్రువపత్రం

వరంగల్‌ కాశీబుగ్గ ఎస్సార్‌ నగర్‌కు చెందిన చిన్నారి ఏంజిల్‌కు ఎట్టకేలకు సదరం ధ్రువపత్రం అందింది. పుట్టుకతోనే.. చెవిటి, మూగ, వెన్ను సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న...

Published : 30 Jun 2022 05:52 IST


ధ్రువపత్రాన్ని చూపిస్తున్న ఏంజిల్‌ నాన్నమ్మ

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ కాశీబుగ్గ ఎస్సార్‌ నగర్‌కు చెందిన చిన్నారి ఏంజిల్‌కు ఎట్టకేలకు సదరం ధ్రువపత్రం అందింది. పుట్టుకతోనే.. చెవిటి, మూగ, వెన్ను సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆ చిన్నారికి వికలాంగుల పింఛన్‌ ఇవ్వాలని కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుంది. గత నెల 23న నానమ్మ ఏంజిల్‌ను కలెక్టరేట్‌కు తీసుకొచ్చి తన మొర చెప్పుకుంది. ఈ అంశంపై మే 24న ‘చిన్నారికి పింఛన్‌ ఇయ్యరూ’ అంటూ ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు త్వరితగతిన ఏంజిల్‌కు సదరం ధ్రువపత్రాన్ని అందజేశారు. త్వరలో చిన్నారికి పింఛన్‌ అందుతుందని డీఆర్డీవో పింఛన్‌ల విభాగం అధికారి పరమాత్మ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని