logo

వరంగల్‌లో భారాస విజయం ఖాయం

వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్‌రావు అన్నారు.

Published : 20 Apr 2024 01:52 IST

మాట్లాడుతున్న మాజీ మంత్రి దయాకర్‌రావు

కొడకండ్ల, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం కొడకండ్లలో రామోజీ అధ్యక్షతన జరిగిన భారాస మండల స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్పు కోరుకున్న ప్రజలు మోసపోయామని చర్చించుకుంటున్నారన్నారు. భారాసను వదిలి కాంగ్రెస్‌లో చేరినవారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో చెప్పుకొంటున్నారని తెలిపారు. కార్యకర్తలు భారాస విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ సభ్యురాలు సత్తెమ్మ, మార్కెట్‌ మాజీ ఛైర్మన్‌ పేరం రాము, ఎంపీటీసీ సభ్యురాలు మణెమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని