logo

ఇంటి వద్దే.. ఓటేశారు!

ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా భూపాలపల్లి నియోజకవర్గంలో తొలిరోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Published : 05 May 2024 05:27 IST

నేరడుపెల్లిలో ఇంటి వద్ద ఓటు హక్కు వినియోగించుకుంటున్న వృద్ధురాలు

భూపాలపల్లి : ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా భూపాలపల్లి నియోజకవర్గంలో తొలిరోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్ల పైబడిన వృద్ధులు 54 మంది ఉండగా, 40 శాతానికి మించి అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు 24 మంది ఉన్నారు.. హోం ఓటింగ్‌ కోసం జిల్లాలో మొత్తం  78 మందిని గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారి ఇంటికి వెళ్లి ఓటు వేయించేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీ వరకు కార్యక్రమం జరుగుతుంది. పోలింగ్‌ సిబ్బంది మొదటిసారి ఇళ్లకు వెళ్లినప్పుడు దరఖాస్తు చేసుకున్న ఓటర్లు లేకపోతే ఈ నెల 8వ తేదీ వరకు మరో అవకాశం కల్పిస్తారు. ఇంటి నుంచి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఏదైనా కారణంతో ఓటు హక్కు వినియోగించుకోకుంటే.. పోలింగ్‌ రోజు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనర్హులవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని