logo

చిన వేంకన్న క్షేత్రంలో ఎన్నికల ప్రచారం

ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు.

Published : 28 Mar 2024 04:15 IST

18 మందిపై కేసు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ఎన్నికల నియమావళి ఉల్లంఘించి ద్వారకాతిరుమల చిన్నవేంకన్న ఆలయ కేశ ఖండనశాలలో ఈ నెల 22న వైకాపాకు చెందిన కరపత్రాలు ఆవిష్కరించడంతో పాటు వాటిని పంపిణీ చేసి ప్రచారం చేసిన వైనంపై అధికారులు చర్యలు చేపట్టారు. ఏఈవో నటరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రావిపాటి వెంకటేశ్వరరావుతో పాటు మరో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు ద్వారకాతిరుమల పోలీసులు బుధవారం తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని