logo

చీకటి పాలన నుంచి త్వరలో విముక్తి : నారా రోహిత్‌

అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్‌ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్‌రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం...

Published : 06 May 2024 05:19 IST

మాట్లాడుతున్న రోహిత్‌

తణుకు, తణుకు గ్రామీణ, న్యూస్‌టుడే : అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్‌ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్‌రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం... ఇది నవ గళం పేరుతో నిర్వహించిన తణుకు నియోజకవర్గ యువత ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలిసీ తెలిసీ మనం రాక్షసుడిని తెచ్చుకున్నామని పేర్కొన్నారు. నాడు రాక్షసుడిని అంతం చేయడానికి రాముడు, లక్ష్మణుడు, వానర సైన్యం కలసి పోరాడారు. నేడు జగన్‌ పాలనను అంతం చేయడానికి చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, మోదీ కూటమిగా పోరాడుతున్నారన్నారు. 2014- 19లో నవ్యాంధ్రతో తెలంగాణ పోటీ పడేదని, 2019 తర్వాత ఇక్కడ యువత అంతా తెలంగాణకు వలసలు పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీయే  అధికారంలోకి రావాలన్నారు.  అప్పుడే వస్తే ఐటీ కంపెనీలు, పరిశ్రమలు రాష్ట్రానికి తరలివచ్చి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.  ‘‘హలో ఏపీ బైబై వైసీపీ’’ అంటూ యువతలో ఉత్సాహాన్ని రేకెత్తించి ప్రసంగం ముగించారు.  కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో చరిత్రాత్మక నిర్ణయానికి యువత పెద్ద ఎత్తున దీక్ష వహించి దుర్మార్గ వైకాపాను ఇంటికి పంపించేందుకు కృషి చేయాలన్నారు. అనంతరం నారా రోహిత్‌ను నాయకులు, కార్యకర్తలు గజ మాలతో ఘనంగా సన్మానించారు. తణుకు పట్టణం, తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాలకు చెందిన తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని