logo

ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలివ్వండి

జగనన్న కాలల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నవారికి ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య డిమాండు చేశారు.

Published : 07 Feb 2023 05:34 IST

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న సీపీఐ, ఏఐటీయూసీ, భవన నిర్మాణ కార్మిక సంఘాల నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే: జగనన్న కాలల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నవారికి ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈశ్వరయ్య డిమాండు చేశారు. కలెక్టరేట్‌  ఎదుట సోమవారం సీపీఐ, ఏఐటీయూసీˆ, భవన నిర్మాణ, ఇతర ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఆందోళన చేపట్టారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు త్వరిత గతిన స్వాధీనపరచాలని డిమాండు చేశారు. జిల్లాలోని 500 లేఅవుట్లలో 77,161 ఇళ్లు మంజూరవ్వగా, జగనన్న కాలనీల్లో వేసిన ప్లాట్లను అనర్హులు, నాయకులు దక్కించుకుని క్రయవిక్రయాలకు తెరలేపారని ఆరోపించారు. సిమెంటు, ఇటుకలు, ఇసుక, ఇనుము తదితర నిర్మాణ సామగ్రి ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వాటికి అనుగుణంగా లబ్ధిదారులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షలకు పెంచాలని డిమాండు చేశారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా నిర్మాణాలు చేపట్టకపోతే ఇళ్లను రద్దు చేస్తామని లబ్ధిదారులను బెదిరిస్తుండడం సరికాదన్నారు. ఈనెల 22వ తేదీ వరకు సీపీఐ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ల నిర్మాణాలపై సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ గిరీషకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, సాంబశివ, మహేష్‌,  నరసింహులు, కృష్ణప్ప, విశ్వనాధనాయక్‌, మనోహర్‌రెడ్డి, మురళీ, సుమిత్ర, వెంకటేష్‌, జక్కల వెంకటేష్‌, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని