logo

విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండ

విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 28 Mar 2023 03:18 IST

విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల స్కూటర్లను అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి

రాయచోటి, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో సోమవారం విభిన్న ప్రతిభావంతులకు రూ.68 లక్షల విలువైన 57 మూడు చక్రాల మోటారు సైకిళ్లను కలెక్టరు గిరీష, జేసీˆ తమీమ్‌అన్సారియా, జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాధరెడ్డి, పీˆలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి అందజేశారు. నియోజకవర్గానికి 10 స్కూటర్ల చొప్పున మంజూరు చేశారన్నారు. అర్హత ఉండి వాహనం అందని దివ్యాంగులెవరూ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న నాయకుడు సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అని జడ్పీ ఛైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. అన్ని వర్గాల మోములో చిరునవ్వు చూడాలన్నదే సీఎం లక్ష్యమన్నారు. జిల్లాలో 57 మంది ప్రతిభావంతులకు మూడు చక్రాల స్కూటర్లు అందించడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అర్హత ఉండి వాహనాలు అందని వారికి మూడు వారాల్లో అందించనున్నట్లు కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. అనంతరం కొత్తగా మంజూరైన నాలుగు 104 వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల సహాయ సంస్థ ఛైర్‌పర్సన్‌ ముంతాజ్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎస్‌.ఫయాజ్‌బాషా, వైకాపా నాయకులు మహమ్మద్‌ఖాన్‌, కౌన్సిలర్లు ఫయాజ్‌అహమ్మద్‌, ఈశ్వర్‌ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని