logo

అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ : ఎస్పీ

జిల్లాలో మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి సాధ్యమైనంత తొందరగా వారి ఆచూకీ గుర్తించాలని ఎస్పీ అన్బురాజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

Published : 29 Mar 2023 03:48 IST

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే : జిల్లాలో మహిళలు, బాలికల అదృశ్యం కేసుల్లో సమగ్ర విచారణ జరిపి సాధ్యమైనంత తొందరగా వారి ఆచూకీ గుర్తించాలని ఎస్పీ అన్బురాజన్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్‌ సమావేశ మందిరంలో జరిగిన నేరాల సమీక్షలో ఎస్పీ మాట్లాడారు. పోక్సో, మహిళలపై జరిగిన నేరాల్లో నిర్ణీత సమయంలో ఛార్జ్‌షీటు దాఖలు చేయాలన్నారు. గంజాయి అక్రమ రవాణాపై నిఘా ఉంచి జిల్లా సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలన్నారు.  సమావేశంలో ఏఎస్పీలు ప్రేరణకుమార్‌, నీలం పూజిత, ఏఆర్‌ అదనపు ఎస్పీ కృష్ణారావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని