logo

‘మాదిగలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు’

రాష్ట్రంలోని మాదిగలకు వర్గీకరణ అంశంలో న్యాయం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ ఆరోపించారు.

Updated : 30 Mar 2023 06:56 IST

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన చేస్తున్న ఏపీ ఎమ్మార్పీఎస్‌ నేతలు

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే : రాష్ట్రంలోని మాదిగలకు వర్గీకరణ అంశంలో న్యాయం చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని ఏపీ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ ఆరోపించారు. బుధవారం కడప కలెక్టరేట్‌ ఎదుట ఏపీ ఎమ్మార్పీఎస్‌ నేతలు ఆందోళన చేపట్టారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీరయ్యమాదిగ మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 69 శాతానికి పెంచారని, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అఖిల పక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని ఒప్పించి ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేశారు. పశుసంవర్ధకశాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తూ హత్యకు గురైన డాక్టర్‌ అచ్చెన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ధర్నాలో రాష్ట్ర కార్యదర్శి ఆంజనేయులు, డప్పుకళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగభూషణం, నాయకులు గంగులు, రమణ, సుబ్బరాయుడు, లలితమ్మ, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని