‘రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయి’
‘రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు కాదు.. వైసీపీ సెక్షన్లు నడుస్తున్నాయి..ఇప్పుడున్న శాసనసభ్యులందరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే అందరూ జైలుకు వెళ్తారు.
కడప, చిన్నచౌకు, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు కాదు.. వైసీపీ సెక్షన్లు నడుస్తున్నాయి..ఇప్పుడున్న శాసనసభ్యులందరిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తే అందరూ జైలుకు వెళ్తారు.. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలు విరిగిపోతాయి’ అని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం కడప ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. దేశ వ్యాప్తంగా డిజిటల్ సేవలుంటే, రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో డిజిటల్ సేవలు లేకపోవడం విడ్డూరంగా ఉందని, తద్వారా రూ.వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. సీఎం జగన్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, వ్యతిరేకత సునామీలో వైకాపా కొట్టుకుపోతుందన్నారు. వైకాపా ప్రజావ్యతిరేక విధానాలపై భాజపా చార్జీషీట్ పేరిట నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక, మట్టి, స్థలాలు, మద్యం, మైన్స్‌లో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోందని విమర్శించారు. ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్ విషయం పూర్తిగా న్యాయస్థానం పరిధిలో ఉందని అభిప్రాయపడ్డారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో పలువురిని సీబీఐ అరెస్టు చేసింందని, భాజపాకు ఎవరినీ రక్షించాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బాలకృష్ణయాదవ్, జిల్లా అధ్యక్షుడు యల్లారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, నాయకులు పవన్‌కుమార్, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి