కాంగ్రెస్ అధికారంలోకొస్తే ఆరు సూత్రాల పాలన
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రయోజనకు వీలుగా ఆరు సూత్రాల పాలనను అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ ఛైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు.
గ్రామస్థులకు కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్న తులసిరెడ్డి
ఎర్రగుంట్ల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా ప్రయోజనకు వీలుగా ఆరు సూత్రాల పాలనను అమలు చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ ఛైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. శనివారం ఎర్రగుంట్లలో పలువురు తులసిరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర, మహిళలకు రూ. 500లకే రాయితీ గ్యాస్ సిలిండర్లు, ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.6000, ప్రత్యేక హోదా ద్వార పరిశ్రమలు స్థాపించి యువత ఉద్యోగ అవకాశాలు, బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ, విభజన చట్టంలోని హామీలు అమలు చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె ఓబయ్య, జానకీ రామ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి