logo

సీ విజిల్‌ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం : కలెక్టర్‌

రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్‌, ఎన్‌ కోర్‌, ఈ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు.

Published : 28 Mar 2024 03:52 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌

రాయచోటి, న్యూస్‌టుడే: రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి జిల్లాలో సీ విజిల్‌, ఎన్‌ కోర్‌, ఈ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అందిన ఫిర్యాదులను సత్వరం పరిష్కరిస్తున్నామని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ అభిషిక్త్‌ కిశోర్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై 583 ఫిర్యాదులందగా 564, సి-విజిల్‌ ద్వారా 74 ఫిర్యాదులకు  74, ప్రింట్‌ మీడియా ద్వారా 52 ఫిర్యాదులందగా 52, కంప్లయింట్‌ మానిటరింగ్‌ యాప్‌, సీఈవో ద్వారా 16 ఫిర్యాదులందగా 8, ఆఫ్‌లైన్‌ ద్వారా 25 ఫిర్యాదులకు 22 పరిష్కరించామని వివరించారు ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన వెంటనే కలెక్టరేట్‌లో జిల్లా ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ.61.19 లక్షల విలువైన నగదు, వస్తువులు సీజ్‌ చేశామని వివరించారు. ఎంసీసీ అతిక్రమణల కింద ఏడు కేసులు నమోదు చేశామని కలెక్టర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని