logo

వైకాపా సేవకు బస్సులు... ప్రయాణికులకు ఇక్కట్లు

సీఎం జగన్‌ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 28 Mar 2024 03:58 IST

బస్సుల్లేక ఖాళీగా ఉన్న కడప ఆర్టీసీ బస్టాండు 

చిన్నచౌకు (కడప), బద్వేలు, గోపవరం, న్యూస్‌టుడే: సీఎం జగన్‌ బహిరంగ సభలకు జిల్లా నుంచి నాలుగు రోజులపాటు 6 డిపోల నుంచి 90 ఆర్టీసీ బస్సులను తరలించడంతో గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం ప్రొద్దుటూరు, గురువారం నంద్యాల, శుక్రవారం ఎమ్మిగనూరు. శనివారం కర్నూలులో సీఎం బహిరంగసభలకు జనాలను తరలించి తిరిగి ఆదివారం డిపోలకు చేరతాయి. కడప నగరానికి మదనపల్లె డిపో-2 బస్సులు కేటాయించారు. ఈ నేపథ్యంలో కడప బస్టాండులో ఫ్లాట్‌ఫాంలు బస్సుల్లేక ఖాళీగా కనిపించాయి. ప్రయాణికులు పడిగాపులు కాశారు. ఓ వైపు ఎండ, ఉక్కపోతతో అల్లాడిపోయారు. బస్సులు రాకపోవడంతో ప్రైవేటు వాహనాలకు ఆశ్రయించాల్సి వచ్చింది. బద్వేలు ఆర్టీసీ డిపో నుంచి 23 బస్సులను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన సిద్ధం బస్సు యాత్రకు పంపడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. సరైన సమయంలో బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరలేకపోయారు. వైయస్‌ఆర్‌, కర్నూలు జిల్లాల్లో మూడు రోజుల పాటు జరిగే సీఎం సభలకు వెంబడే వెళ్లాల్సి రావడం, తొలిసారిగా రాయలసీమ జిల్లాల్లోని 52 డిపోలకు చెందిన 1,107 ఆర్టీసీ బస్సులు పంపడంతో ఇటు సిబ్బంది సైతం విధులకు వెళ్లలేమని చెప్పినా, పర్యవేక్షకులు నచ్చచెప్పి పంపడం గమనార్హం.

బద్వేలు ఆర్టీసీ బస్టాండులో బస్సుల్లేక ప్రయాణికుల అవస్థలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని