logo

వివేకా హత్య కేసులో నిందితుడు అవినాష్‌ ఎంపీ టికెట్టా?

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు.

Published : 29 Mar 2024 05:10 IST

ప్రసంగిస్తున్న భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి, పక్కన బొమ్మన సుబ్బరాయుడు, లక్ష్మీనారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి తదితరులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో నిందితుడు వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని, తన చిన్నాన్నను ఎవరో చంపేశారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని భాజపా జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి అన్నారు. కడప ఎన్జీవో కాలనీలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ వై.ఎస్‌.కుటుంబానికి గత 40 ఏళ్ల నుంచి మద్దతు ఇచ్చిన కడప ఎంపీ టిక్కెట్‌ను అవినాష్‌రెడ్డికి కేటాయించడాన్ని భాజపా తీవ్రంగా ఖండిస్తోందని పేపర్కొన్నారు. ప్రొద్దుటూరు సభలో జగన్‌ అన్నీ అసత్యాలే చెప్పారని ఆరోపించారు. రాష్ట్రంలో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పిన సీఎం, ఇప్పటికి 6 లక్షలు మాత్రమే ఇచ్చారని, అవి కూడా పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందలేదన్నారు. జగనన్నకాలనీల్లో ఇళ్లన్నీ నాసిరకంగా ఉన్నాయని చెప్పారు. సచివాలయాలు, రైతు భరోసా భవనాలను పూర్తిగా కేంద్రం నిధులతో నిర్మించారని, జగన్‌ మాత్రం తానే కట్టానని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు. వైయస్‌ఆర్‌ జిల్లాలో కూటమి పొత్తులో భాగంగా భాజపాకు కేటాయించిన రెండు స్థానాల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. భాజపా పార్లమెంటు కన్వీనర్‌ బొమ్మన సుబ్బరాయుడు, రాష్ట్ర నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకటసుబ్బారెడ్డి, చేవూరి శారద, బొమ్మన విజయ్‌, పవన్‌ తదితరులున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని