logo

పెద్దిరెడ్డి కుటుంబ దోపిడీని ఓటుతో అడ్డుకోండి

రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు.

Published : 19 Apr 2024 03:09 IST

ఎన్‌డీఏ కూటమిదే అధికారం
మాజీ సీఎం, భాజపా ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి

ర్యాలీలో మాట్లాడుతున్న భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పక్కన కిశోర్‌కుమార్‌రెడ్డి, నాయకులు

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే : రాజంపేట పార్లమెంట్‌ పరిధిలో పెద్దిరెడ్డి దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. గురువారం పీలేరులో ఆయన సోదరుడు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ర్యాలీ, బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. తాను అడిగిన పదవులు ఏవీ తనకు రాలేదన్నారు. మంత్రి పదవి అడిగాను రాలేదు. అగడకుండా చీఫ్‌విప్‌, స్పీకర్‌, సీఎం పదవులు వచ్చాయని, ఎంపీ కావాలని తాను అడగలేదని భాజపా అధినాయకత్వం, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ సహకారంతో ఎంపీగా పోటీ చేస్తున్నానని ఆయన చెప్పారు. ఎన్‌డీఏకు 350 పైచిలుకు ఎంపీ సీట్లు  వస్తాయని అందులో తాను ఎంపీగా ఉంటానని ఆయన జోస్యం చెప్పారు. అధికారం చేపట్టగానే ఏపీకి రావాల్సిన నిధులను తెప్పించి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రి హాదాలో నేషనల్‌ మ్యానిఫాక్చరింగ్‌ జోన్‌ కోసం రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి భూ సేకరణ చేసి 10 ఏళ్ల కిందట బిల్‌ పాస్‌ చేయించామని ఆయన చెప్పారు. దీంతో రూ.30 వేల కోట్లతో 30 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన చెప్పారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పార్లమెంటులో ఒక్కమాట కూడా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. వైకాపా అధికారంలో స్థానిక సంస్థలు, సర్పంచుల ఎన్నికలు లేకుండా చేశారనీ, 30 వేల దొంగ ఓట్లు సృష్టించి ఐఏఎస్‌లను ఇంటికి పంపిన ఘనత వైకాపా నాయకులకే దక్కుతుందని ఆయన అన్నారు. ఇలాంటి వారిని తిరిగి ఎన్నుకుంటే మనకే చేటన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని