logo

Crime News: భర్త హత్యకు రూ.10లక్షల సుపారీ

కుందానగరి బెళగావిలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్‌ హత్య సంఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఆయన రెండో భార్య, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఇద్దరు భాగస్థులు హత్యకు పథకాన్ని రూపొందించారని,

Updated : 24 Mar 2022 12:23 IST


 రాజు దొడ్డబొమ్మన్నవర్‌ (పాతచిత్రం)

బెళగావి, న్యూస్‌టుడే : కుందానగరి బెళగావిలో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి రాజు దొడ్డబొమ్మన్నవర్‌ హత్య సంఘటన అనూహ్య మలుపు తిరిగింది. ఆయన రెండో భార్య, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఇద్దరు భాగస్థులు హత్యకు పథకాన్ని రూపొందించారని, హంతకులకు రూ.పది లక్షల సుపారీ చెల్లించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని రూపొందించిన హతుడి రెండో భార్య కిరణ, భాగస్థులు ధర్మేంద్ర, శశికాంత్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 15న ఉదయం రాజు దొడ్డబొమ్మన్నవర్‌ హత్యకు గురైన విషయం గుర్తుండే ఉంటుంది. ఉదయం మోటార్‌ సైకిల్‌పై వచ్చిన దుండగులు ఆయన ముఖంపై కారంపొడి చల్లి హత్య చేసి పరారయ్యారు.

రహదారి పక్కన పడి ఉన్న శవాన్ని వ్యాహ్యాళికి వచ్చిన కొందరు గుర్తించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగులోనికి వచ్చాయి. రాజు దొడ్డబొమ్మన్నవర్‌కు ముగ్గురు భార్యలు. వారికి వేర్వేరుగా ఇళ్లను నిర్మించారు. డబ్బు విషయంలో రెండో భార్య కిరణతో గొడవలొచ్చాయి. ఇదే అదనుగా వ్యాపారంలో భాగస్థులు ఆమెతో చేతులు కలిపారు. హంతకులతో మాట్లాడి రూ.10 లక్షల సుపారీ ఇచ్చారని పోలీసులు వివరించారు. అనుమానంతో భార్యను అదుపులోనికి తీసుకోవడంతో హత్య సంఘటన దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినట్లైందని పోలీసులు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని