icon icon icon
icon icon icon

Telangana Elections: పార్టీ ఏదైనా టికెట్‌ వీరికే..

సాధారణంగా ఒక పార్టీలో చేరి.. అదే పార్టీలో ఏళ్ల తరబడి ఉంటే కూడా పార్టీ టికెట్‌ వస్తుందో రాదో తెలియని పరిస్థితి.

Updated : 13 Nov 2023 08:16 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: సాధారణంగా ఒక పార్టీలో చేరి.. అదే పార్టీలో ఏళ్ల తరబడి ఉంటే కూడా పార్టీ టికెట్‌ వస్తుందో రాదో తెలియని పరిస్థితి. అలాంటిది పార్టీ ఏదైనా.. ఆ పార్టీ టికెట్‌ను దక్కించుకోవడంతో పాటు.. ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తమ సత్తా చూపుతున్నారు.  గతంలో మాదిరిగా ఒకే పార్టీని అంటిపెట్టుకొని, ఆ పార్టీ ఆశయాలకు కట్టుబడి పని చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. టికెట్‌ రాకపోతే వేరే పార్టీలోకి మారుతున్నారు. అలా వెళ్లడమే కాకుండా ఆ పార్టీల నుంచి టికెట్‌ పొంది ఎన్నికల బరిలో తలపడుతున్నారు.

 ఖానాపూర్‌ నియోజకవర్గంలో భాజపా నుంచి బరిలో ఉన్న రమేశ్‌ రాఠోడ్‌ తెదేపా నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎంపీగా విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఈయన ఎమ్మెల్యే, ఎంపీ టికెట్‌ సాధించి పోటీ చేసినా గెలుపొందలేదు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో భాజపా టికెట్‌ సాధించి తిరిగి పోటీ చేస్తున్నారు.

ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉండి 2009లో ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన జోగు రామన్న.. తెదేపా ప్రాబల్యం తగ్గడంతో తెరాసలో చేరి టికెట్‌ను దక్కించుకోవడంతో పాటు వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సైతం ఆయనకే భారాస టికెట్‌ ఇవ్వడంతో ఎన్నికల బరిలో ఉన్నారు.

 బోథ్‌ నియోజకవర్గంలో సోయం బాపురావు 2004లో తెరాస నుంచి పోటీ చేశారు. తర్వాత 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి టిక్కెట్‌ పొంది పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత 2018లో కాంగ్రెస్‌ పార్టీలో చేరగానే ఆ పార్టీ టికెట్‌ ఇచ్చింది. ఆ పార్టీ నుంచి ఓటమి చెందిన ఆయన 2019లో భాజపాలో చేరి పార్లమెంట్‌ టికెట్‌ దక్కించుకొని విజయం సాధించారు. తాజాగా ఇదే పార్టీ నుంచి బోథ్‌ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img