icon icon icon
icon icon icon

సుదీర్ఘ విరామానికి తెర!

ఇల్లెందు నియోజకవర్గంలో సుదీర్ఘ విరామం తర్వాత సీపీఎం ఎన్నికల బరిలో నిలిచింది. గత ఎనిమిదిసార్లుగా పోటీకి దూరంగా ఉన్న ఆ పార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా దుగ్గి కృష్ణయ్యను నిలబెట్టింది.

Updated : 14 Nov 2023 11:13 IST

కేఎల్‌ నరసింహారావు

ఇల్లెందు నియోజకవర్గంలో సుదీర్ఘ విరామం తర్వాత సీపీఎం ఎన్నికల బరిలో నిలిచింది. గత ఎనిమిదిసార్లుగా పోటీకి దూరంగా ఉన్న ఆ పార్టీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ అభ్యర్థిగా దుగ్గి కృష్ణయ్యను నిలబెట్టింది. నియోజకవర్గంలో మొత్తం 17సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా సీపీఎంకు చెందిన కేఎల్‌ నరసింహారావు 1952, 57 సంవత్సరాల్లో రెండుసార్లు పీడీఎఫ్‌ తరఫున, 1962లో అవిభక్త సీపీఐ తరఫున ఓసారి గెలుపొందారు. విశాఖ ఉక్కు- ఉద్యమంలో భాగంగా పార్టీ నిర్ణయం మేరకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కేఎల్‌ సీపీఎంలో కొనసాగారు. 1972లో రిజర్వు స్థానమైన ఇల్లెందులో సీపీఎం అభ్యర్థి కందాల బుచ్చయ్య 300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1983లో గుగులోత్‌ ధర్మా 517 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనంతర కాలంలో కొన్నిసార్లు తెదేపాతో పొత్తు, ఇంకొన్నిసార్లు వేరే పార్టీలకు మద్దతు ఇవ్వటంతో సీపీఎం 1985 నుంచి తమ అభ్యర్థిని నిలపలేదు. ఎట్టకేలకు ప్రస్తుత ఎన్నికల బరిలో నిలిచింది.

ఇల్లెందు, న్యూస్‌టుడే

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img