icon icon icon
icon icon icon

నవాబు పేట నేతలు వీరు!

పూర్తిగా గ్రామీణ ప్రాంత నేపథ్యమున్న నవాబుపేట మండలం నుంచి పలువురు ప్రజా ప్రతినిధులుగా రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుత భారాస అభ్యర్థి, శాసనసభ్యులు కాలె యాదయ్య స్వగ్రామం నవాబుపేట మండలం చించల్‌పేట. 

Updated : 14 Nov 2023 15:23 IST

పూర్తిగా గ్రామీణ ప్రాంత నేపథ్యమున్న నవాబుపేట మండలం నుంచి పలువురు ప్రజా ప్రతినిధులుగా రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుత భారాస అభ్యర్థి, శాసనసభ్యులు కాలె యాదయ్య స్వగ్రామం నవాబుపేట మండలం చించల్‌పేట. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న కాంగ్రెస్‌ నాయకులు, శాసన మండలి మాజీ సభ్యులు కొంపల్లి యాదవరెడ్డి స్వస్థలం నవాబుపేట మండలం పులుమామిడి గ్రామం. దివంగత ఎమ్మెల్యే బి.సంజీవరావుదీ ఇదే మండలంలోని గేటువనంపల్లి గ్రామం. రాష్ట్ర విద్య మౌలిక వసతుల కల్పన సంస్థ మాజీ ఛైర్మన్‌ జి.నాగేందర్‌గౌడ్‌ స్వస్థలం ఈ మండలానికి చెందిన అత్తాపూర్‌ గ్రామం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img