icon icon icon
icon icon icon

స్వతంత్రం.. జయకేతనం

ఎన్నికల్లో పార్టీల టికెట్లు ఆశించే ఆశావహులు ఎంతో మంది ఉంటారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే విజయం సాధించడం సులభమని భావిస్తుంటారు.

Published : 15 Nov 2023 13:32 IST

ప్రధాన అభ్యర్థులకు ఝలక్‌

న్యూస్‌టుడే, చేగుంట: ఎన్నికల్లో పార్టీల టికెట్లు ఆశించే ఆశావహులు ఎంతో మంది ఉంటారు. పార్టీ గుర్తుపై పోటీ చేస్తే విజయం సాధించడం సులభమని భావిస్తుంటారు. ఇందుకు పార్టీలో ఉండి టికెట్టు తెచ్చుకునేందుకు యత్నిస్తుంటారు. ఒకవేళ టికెట్‌ ఇవ్వని పక్షంలో స్వతంత్రులుగా రంగంలోకి దిగి విజయకేతనం ఎగరవేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో ఎంతోమంది గెలుపు అందుకొని తమ సత్తా చాటారు. 13 మంది ఇలా విజయాలు అందుకున్నారు.

1962

గజ్వేల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నాయకుడు జి.వెంకటస్వామి పోటీ చేయగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సైదయ్య 1027 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

  •  సిద్దిపేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీ రాజేశ్వర్‌రావుపై స్వతంత్రుడిగా పోటీ చేసిన సోమేశ్వర్‌రావు విజయకేతనం ఎగరవేశారు.
  • కొడంగల్‌ నియోజకవర్గంలో 1962లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఇల్లరి బసప్పపై రుక్మారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు.

1972

మెదక్‌ నియోజకవర్గం నుంచి కరణం రామచందర్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా విజయం అందుకున్నారు.

  • నారాయణఖేడ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వెంకట్‌రెడ్డి గెలుపొందారు.
  • నందారం వెంకటయ్య గెలుపు అందుకున్నారు.

1952

సంగారెడ్డి నియోజకవర్గంలో ఏకంగా నలుగురు స్వతంత్రులు గెలుపొందారు. కృష్ణమాచారి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి జీఆర్‌ రెడ్డిపై 2654 ఓట్ల ఆధిక్యంతో విజయం పొందారు.

రాజగోపాల్‌పేట నుంచి స్వతంత్రుడిగా పోటీ చేసిన కేవీ నారాయణరెడ్డి విజయం సాధించారు.
అందోలు నుంచి శరత్‌గౌడ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన దత్తాత్రేయరావుపై 7,181 ఓట్లతో గెలుపొందారు.

1967

దొమ్మాట నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీ చేసిన ఖాజా మోహినొద్దీన్‌పై స్వతంత్రుడు మ్యాడ భీంరెడ్డి 2749 ఓట్లతో విజయం సాధించారు.
కాంగ్రెస్‌ అభ్యర్థి పి.రామచంద్రారెడ్డిపై స్వతంత్రుడు నర్సింహారెడ్డి 2065 ఓట్లతో గెలుపు సాధించారు.

1978

జనతా పార్టీ తరఫున పి.రామచంద్రారెడ్డి బరిలోకి దిగగా.. నర్సింహారెడ్డి 19,210 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

1983

కాంగ్రెస్‌ అభ్యర్థి పి.వీరారెడ్డిపై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రామచంద్రారెడ్డి 5705 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

2004

మెదక్‌ నుంచి జనతా పార్టీ తరఫున బరిలోకి దిగిన పట్లోళ్ల శశిధర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img