Top 10 News @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Apr 2021 17:11 IST

1. తెలంగాణలో అందరికీ ఉచిత వ్యాక్సిన్‌: కేసీఆర్‌

తెలంగాణ ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. రాష్ట్రంలో నానాటికీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. వ్యాక్సినేషన్‌ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 7 రాష్ట్రాలు.. 17లక్షల యాక్టివ్‌ కేసులు! 

భారత్‌లో కరోనా వ్యాప్తి అంతకంతకూ ఉద్ధృతమవుతోంది. నిన్న ఒక్కరోజే 3.46లక్షల కొత్త కేసులు, 2624 మరణాలు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ భారీగా పెరిగిపోతోంది. కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 25,52,940 యాక్టివ్‌ కేసుల్లో 17లక్షలకు పైగా (దాదాపు 67శాతం) కేసులు కేవలం ఏడు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

72గంటలు.. 10లక్షల కేసులు.. 7వేల మరణాలు

3. గర్భిణీ అయినా భయపడలేదు!

‘మహిళ అబల కాదు.. ఆదిశక్తి’ అని నిరూపిస్తున్నారు నేటి మహిళలు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయట అడుగుపెట్టేందుకే ప్రజలు భయంతో వణికిపోతుంటే..ఎంతో ధైర్యంతో మహిళలు తమ వృత్తికి న్యాయం చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళా పోలీస్‌ అధికారిని చూపిన అంకితభావం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఐదు నెలల గర్భవతి అయిన శిల్పా సాహు అనే డీసీపీ రోడ్డు మీద వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ లాక్‌డౌన్‌ మార్గదర్శకాలను అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కరోనా రెండోదశ: కేంద్రం కీలక నిర్ణయం

రెండో దశలో కరోనా ఉద్ధృతి తీవ్రమవుతోన్న వేళ.. వైద్యపరంగా ప్రజలపై పడుతోన్న భారాన్ని తగ్గించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్, కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్‌ను తక్షణమే మాఫీ చేయనున్నట్లు శనివారం ప్రకటించింది. మూడు నెలల కాలానికి ఇది అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై నేడు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌లో భయానక పరిస్థితులు: ఆంటోనీ ఫౌచీ

కరోనా వైరస్‌ విషయంలో భారత్‌ ప్రస్తుతం అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటోందని అమెరికా వైద్య విభాగం ఉన్నత సలహాదారు ఆంటోనీ ఫౌచీ పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌కు తాము ఏవిధంగానైనా సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

భారత్‌కు ప్రపంచ దేశాల ఆపన్నహస్తం!

6. కేటీఆర్‌కు కరోనా.. మంచు లక్ష్మి సలహా!

తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో పరీక్ష చేయించుకున్నానని పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ట్విటర్‌ ద్వారా కేటీఆర్‌ వెల్లడించారు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ట్విటర్‌ వేదికగా ఆకాంక్షించారు. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పలు దేవాలయాల్లో పూజలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Oxygen Langarతో ప్రాణాలు నిలుపుతున్నారు!

దేశంలో కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న వేళ ఆస్పత్రులలో ఆక్సిజన్‌ సరఫరా లేక రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తర్‌ప్రదేశ్‌ ఇందిరాపురం గురుద్వారాలో ‘ఆక్సిజన్‌ లాంగర్‌’ను అందుబాటులోకి తెచ్చారు. మహమ్మారి సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్న వారికి ఇక్కడ ఉచితంగా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో సమస్య ఉన్న ఎవరికైనా ప్రాణవాయువు అందిస్తామని గురుద్వారా నిర్వాహకులు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* సింగపూర్‌ నుంచి యుద్ధ విమానాల్లో ఆక్సిజన్‌..

8. చిరు సినిమా.. నో చెప్పా: ఇంద్రజ

 ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ పాటతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన నటి ఇంద్రజ. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ‘యమలీల’తో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ఒకానొక సమయంలో మెగాస్టార్‌ చిరంజీవితో నటించే అవకాశాన్ని వదులుకున్నారట. ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న ఇంద్రజ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌ గురించి ఎన్నో ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం తొమ్మిదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినట్లు ఆమె తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆరోగ్య బీమాలో క్లెయిమ్ తిర‌స్క‌ర‌ణ కార‌ణాలు

ఈ కింది సందర్భాలలో పాలసీ క్లెయిమ్ పూర్తిగా గానీ , కొత్త మొత్తం గానీ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. బీమా కంపెనీ వారు అడిగిన అన్ని పత్రాలను సమర్పించక పోయినా, పరిమితికి మించి క్లెయిమ్ చేసినా , పాలసీలో చెప్పినట్లు కో-పేమెంట్ (సహా- చెల్లింపులు), ఉప పరిమితులు (సబ్-లిమిట్స్ ), చెల్లంచలేని వస్తు సేవలకు క్లెయిమ్ చేసినా తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది . అందువలన పాలసీ తీసుకునే సమయంలోనే ఈ అంశాల గురుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

whatsappలో ఆ లింక్‌లు అస్సలు క్లిక్‌చేయొద్దు! 

10. ఇలా వచ్చారు.. అలా దంచారు..

ఐపీఎల్‌-14 సీజన్ సగం కూడా పూర్తి కాకముందే మ్యాచ్‌లు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక్కోసారి కొన్ని జట్లు తొందరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడటం మనం చూస్తుంటాం. అప్పుడు కొంతమంది ఆటగాళ్లు  ‘నేనున్నా’ అంటూ ముందుకు వచ్చి ఆపద్భాందవులుగా మారుతారు. క్షణాల్లో పరుగుల వరద పారిస్తారు. ఈ ఐపీఎల్‌లో  కూడా కొందరు ఆటగాళ్లు ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో ‘ఉప్పెన’లా విరుచుకుపడి ఆ జట్లకు ‘జాతిరత్నాలు’గా మారారు. ఇలా ‘పవర్‌ హిట్టింగ్’ చేస్తూ వేగవంతమైన అర్ధశతకాలనూ నమోదు చేశారు. మరి ఈ సీజన్‌లో ఇప్పటివరకు వేగవంతమైన అర్ధశతకాలు సాధించిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని