అయోధ్య భూమిపూజను ఎంతమంది వీక్షించారంటే?

అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా వీక్షించినట్లు.............

Published : 09 Aug 2020 05:42 IST

దిల్లీ: అయోధ్యలో రామ మందిర భూమిపూజ కార్యక్రమాన్ని దేశమంతా ఆసక్తిగా తిలకించింది. ప్రధాని మోదీ పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలు టీవీలకు అతుక్కపోయారు. ఈ నెల 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని సుమారు 16 కోట్ల మందికి పైగా టీవీల ద్వారా వీక్షించినట్లు ప్రసార భారతి సీఈవో శశి ఎస్‌ వెంపటి తెలిపారు. ఈ మొత్తం కార్యక్రమం ద్వారా 700 కోట్ల నిమిషాల వ్యూయర్‌షిప్‌ లభించినట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్‌ ప్రత్యక్ష ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఉదయం 10.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య సుమారు 200 ఛానెళ్లు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశాయని శశి తెలిపారు. అయితే, ఇది కేవలం టీవీ ఛానెళ్ల వ్యూయర్‌షిప్‌ మాత్రమేనని పేర్కొన్నారు. అయితే, యూట్యూబ్‌ ద్వారా చూసిన వారి సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చు. అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు దూరదర్శన్‌ ప్రసారం చేసింది. ప్రధాని మోదీ ప్రసంగాన్ని పలు భాషల్లోకి అనువదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని